రాష్ట్రీయం

ఇంటర్‌లోనూ మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాలకపక్ష సభ్యులు గాదరి కిషోర్, కల్వకుంట విద్యాసాగర్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి కడియం సమాధానమిస్తూ ఇంటర్మీడియట్ వరకు ఫీజు రద్దు చేయడంతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎలాగూ ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తుండటంతో వారికి కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించామని, త్వరలోనే దీనిపై ప్రకటన చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్షా 20 వేల మంది విద్యార్థులు ఉండగా ఇంటర్ వరకు ఉచిత విద్యను అమలు చేసిన తర్వాత విద్యార్థుల సంఖ్య లక్ష 73 వేలకు పెరిగిందని మంత్రి వివరించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి జూన్ 12న తెరుస్తామని, అప్పటివరకు రాష్టవ్య్రాప్తంగా అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్, నీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. టాయిలెట్స్ నిర్వహణ కోసం ఇద్దరు వర్కర్లను కూడా నియమిస్తున్నామన్నారు. టాయిలెట్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రతీ పాఠశాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతోనే సరిపోదని, వాటికి నీటి సౌకర్యం కూడా కల్పించబోతున్నామన్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాత గతంలో ఆరేడు, నెలల వరకు కూడా పాఠ్య పుస్తకాల సరఫరా జరిగేది కాదని, ఇకనుంచి పాఠశాలలు తెరవడంతోనే పుస్తకాలనూ అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలు 25,966 ఉన్నాయని, వీటిలో చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా యూనిఫామ్స్‌లను కూడా పాఠశాలలు తెరిచే వరకు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.