రాష్ట్రీయం

కొలీజియం వ్యవస్థలో మార్పు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతమైన కడపలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి డివి సదానందగౌడ హామీ ఇచ్చారు. కడప న్యాయవాదుల సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానందగౌడ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తుల ఎంపికకు ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థలో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా వరకూ నెరవేర్చారని తెలిపారు. సుపరిపాలన అందించడమే ఎన్‌డిఎ ప్రభుత్వ ధ్యేయమన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అదే సమయంలో జడ్జిల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సంబంధిత ఇన్సూరెన్స్, బ్యాంకులు, పోలీసులు, కక్షిదారులను సమన్వయపర్చి లోక్ అదాలత్‌లో చాలా వరకూ పరిష్కరిస్తున్నరంటూ వారిని అభినందించారు. కడపలో హైకోర్టు బెంచ్, స్టీల్ ప్లాంట్ అంశాలను కేంద్రంలోని సంబంధిత శాఖలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. అంతకుముందు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.రాఘవరావు కేంద్ర మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా వాసులు బాగా వెనుకబడి ఉన్నారని, ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు ద్వారా కొంతవరకూ మేలు జరుగుతుందని అన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినపుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలులో, హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేశారని, ఇప్పుడు రాజధాని కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నందున రాయలసీమ కేంద్ర బిందువైన కడపలో హైకోర్టు ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు జడ్జి ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఐసిసి ఇఇ-2016
ఎఫ్‌టిఎపిసిసిఐలో
నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, జనవరి 8: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌పై తొలి 2016-అంతర్జాతీయ సమావేశం ఈ నెల 9న హైదరాబాద్ నగరంలోని ఎఫ్‌టిఏపిసిసిఐలో జరుగుతుందని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రీసెర్చ్‌ర్స్ సైంటిస్ట్స్ ఇంజినీర్స్ అండ్ డాక్టర్స్ (ఐఎస్‌ఆర్‌ఎస్‌ఇడి) ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ రంగానికి చెందిన నిపుణులు యుఎస్‌ఏ నుంచి డాక్టర్ శ్రీనివాస్ పెంట్యాల, డాక్టర్ ఎంఏ రిజ్వీ, డాక్టర్ మహ్మద్ జాఫర్ ఆలీ ఖాన్, మహ్మద్ అబ్దుల్ హమీద్‌లు ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ రంగాల్లో కెరీర్‌కు సంబంధించిన సమాచారాన్ని, విజయ పరిజ్ఞానాన్ని వీరు ఈ సమావేశం ద్వారా అందిస్తారు. ఈ సమావేశంలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపింది.