రాష్ట్రీయం

కెవి రమణారావుకు చాసో పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: సమాజాన్ని నిశిత దృష్టితో పరిశీలించి జనహితమే రచన ధ్యేయంగా మెరుగైన సమాజం నిర్మాణానికి ప్రజలను చైతన్య పరిచేందుకు కథలు రాస్తున్న కెవి రమణారావుకు ఈ ఏడాది చాసో స్ఫూర్తి 21వ పురస్కారాన్ని అందజేయనున్నట్టు చాసో ట్రస్టు ప్రతినిధి డాక్టర్ చాగంటి తులసి చెప్పారు. చాసో 101వ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 17వ తేదీన చాసో స్ఫూర్తి పురస్కార ప్రదానోత్సవాన్ని వైజాగ్ మయూరి హోటల్‌లో నిర్వహిస్తున్నట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ కె. శ్రీనివాసరావు, కేతు విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు.