రాష్ట్రీయం

కాళేశ్వరంపై ఢిల్లీకి అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీని కలుస్తామని సిఎం చంద్రశేఖరరావు చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శాసనసభలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కనుక, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరాలని సభ్యులు చేసిన ప్రకటనపై సిఎం స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక అంశాలపై కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందని, త్వరలోనే ఒక బృందం ఢిల్లీ వెళ్లనుందని, ఆ బృందంతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర సమస్యలను వివరించేందుకు సమయం కావాలని ప్రధాని నరేంద్రమోదీని కోరామని, ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత సమయం ఇస్తామని చెప్పారని, ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కనుక, ఇపుడు ప్రధాని కార్యాలయంతో మాట్లాడి సమయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి కీలక అంశాలపై అఖిలపక్షం వెళ్లడం చాలా ముఖ్యమని, అదే విధంగా ఎస్సీ వర్గీకరణపై కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.