రాష్ట్రీయం

తెరాసకు పిఆర్‌సి గుబులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి బకాయలు బడ్జెట్‌లో చూపించి చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పటంతో, తెరాస వర్గాల్లో గుబులు కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థిని ఎక్కడికక్కడ నిలదీస్తున్న టీచర్లు పోలింగ్ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన తెరాసలో కనిపిస్తోంది.
**
హైదరాబాద్, మార్చి 17: పదో వేతన సవరణ కమిషన్ (పిఆర్‌సి) బకాయిల చెల్లింపులో ప్రభుత్వం చేస్తోన్న జాప్యంపట్ల ఇంతకాలం ఉద్యోగులు ఆందోళన చెందితే, ఇప్పుడు పాలకపక్షం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. పిఆర్‌సి బకాయిలు చెల్లింపులో జరుగుతున్న జాప్యం 19న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం చూపెట్టే ప్రమాదం ఉందని తెరాస వర్గాల్లో గుబులు మొదలైంది. పిఆర్‌సి బకాయిల చెల్లింపునకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా పిఆర్‌సి బకాయిల కోసం నిధులు కేటాయించినట్టు లేకపోవడంతో ప్రస్తుతం ఉపాధ్యాయ ఓటర్లు అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి ఎక్కడికెళ్లినా నిలదీస్తున్నట్టు తెలిసింది. పిఆర్‌సి బకాయిల చెల్లింపుపట్ల ఇంతకాలంగా ప్రభుత్వం కనబర్చిన నిర్లక్ష్యం కారణంగా, వెంటనే చెల్లిస్తామని చెబుతున్నా ఉపాధ్యాయ ఓటర్లు నమ్మడం లేదని తెలిసింది. ఎన్నికల సందర్భంగా హామీ ఇస్తున్నారు తప్ప బకాయిలు చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే బడ్జెట్‌లో నిధులు కేటాయించే వారు కాదా? అని ఓటర్లు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల బడ్జెట్‌లో పిఆర్‌సి బకాయిలు చెల్లించే అంశాన్ని ప్రస్తావించలేదని తెరాస వర్గాల అంటున్నాయి. ఎన్నికల కోడ్ ప్రస్తుతం ఉంది తప్ప, కోడ్ లేనప్పుడు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఉపాధ్యాయ ఓటర్లు నిలదీస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్‌లో ఉద్యోగుల జీభత్యాల కోసం కేటాయించిన నిధులలోనే పిఆర్‌సి బకాయిలు కూడా ఉన్నాయని, ప్రత్యేకంగా పిఆర్‌సి బకాయిల చెల్లింపునకు అని ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పంట రుణాల నాల్గవ విడత మాఫీ వాయిదా చెల్లింపునకు బడ్జెట్‌లో నిధులు కేటాయించగా, పిఆర్‌సి బకాయిల కోసమని నిధులు ఎందుకు కేటాయించలేదని ఉపాధ్యాయ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇలావుంటే, పదవ వేతన సవరణ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగులు కోరిన దానికంటే ఎక్కువగానే 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇంకా సుమారు రూ.3500 కోట్లు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడింది. పదవ పిఆర్‌సి కాలపరిమితి 2019తో తీరిపోతుంది. పదకొండవ పిఆర్‌సిని 2019 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. పదకొండవ పిఆర్‌సి ఏర్పాటుపై వచ్చే ఏడాది 2018లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది కొత్త పిఆర్‌సి ఏర్పాటును ప్రకటించే నేపథ్యంలో పాత బకాయిలను ఈ ఏడాది తప్పనిసరిగా చెల్లించక తప్పదని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడికెళ్లినా ఓటర్లు పిఆర్‌సి బకాయిలపై పాలకపక్షాన్ని నిలదీస్తున్నారని, పైగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ప్రస్తావన లేకపోవడంతో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందేమోనని పాలకపక్షం ఆందోళనకు గురవుతుంది.