రాష్ట్రీయం

ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఉచిత విద్యుత్ అవసరమే రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే ఉచిత విద్యుత్ అమలు చేయాల్సిన అవసరం ఉండదని సిఎం కె చంద్రశేఖరరావు అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో భాగంగా శుక్రవారం సిఎం కె చంద్రశేఖరరావు శాసనసభలో మాట్లాడారు. రైతాంగాన్ని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదని, ప్రాజెక్టుల నిర్మాణంలో రైతుల భూములకే కాకుండా వారి పంటలకు సైతం పరిహారం చెల్లించామని సిఎం తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం ఉండబోదని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల పంటలు ఆదాయం చేతికి వస్తుందని, అలాగే లక్షల విలువైన చేపల పంట పండుతుందని అన్నారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, మరో ఏడాదిలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు.
డబుల్ బెడ్‌రూంలు నిర్మించాకే..
తాము ముందే హామీ ఇచ్చినట్టు రాష్ట్రంలో రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించిన తర్వాతే ఓట్ల కోసం ప్రజలవద్దకు వెళ్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వెనక్కిపోలేదని, ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు బిజీగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, గ్రామాల్లో మరో లక్ష ఇళ్లు నిర్మించిన తర్వాతే తాము ఓట్లు అడుగుతామన్నారు. తాము నిర్మించే రెండు లక్షల ఇళ్లు తెదేపాలో కట్టిన 14 లక్షల ఇళ్లకు సమానమని, తాము లక్ష ఇళ్లకువెచ్చించే డబ్బుతోనే తెదేపా ఏడు లక్షల ఇళ్లు నిర్మించిందని అర్ధం చేసుకోవాలని సిఎం పేర్కొన్నారు.
కమ్యూనిస్టు సిద్ధాంతం అద్భుతం
కమ్యూనిస్టు సిద్ధాంతం అద్భుతమని, ప్రపంచంలో అంతకుమించిన సిద్ధాంతం మరొకటి లేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. మావో, లెనిన్‌లు చెప్పినట్టు ఈ సిద్ధాంతం పరిణామశీలకంగా ఉండాలని, కాని రాను రాను కమ్యూనిస్టు సిద్ధాంతానికి తగ్గట్టు నేతలు లేకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందన్నారు. సిద్ధాంతం గొప్పదని, కాని ఆ పార్టీ నేతలు జడత్వాన్ని సంతరించుకుని తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అనే పద్ధతి అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తాను ప్రకటించిన రెండు రోజుల తర్వాత సిఐటియు నేతలు మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలంటే సమ్మె నోటీసు తనకు ఇస్తే దానిని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. తాను ఎన్నడూ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నిందించలేదని, నేతల పంథాను మాత్రమే ప్రశ్నించానని అన్నారు.