రాష్ట్రీయం

తెలుగు ప్రాధికార సంస్థ అధ్యక్షుడిగా పెద్ది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 18: తెలుగు ప్రాధికార సంస్థ అధ్యక్షుడిగా యువనేత లోకేష్‌కు సలహాదారుగా ఉన్న నాటక రచయిత పెద్ది రామారావు నియమితులు కానున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ తెలుగుభాష, సంస్కతి, కళల అభివృద్ధి, విస్తృతికి కృషి చేయనుంది. ఇప్పటివరకూ ఉన్న అధికార భాషా సంఘం స్థానంలో ఇది ఏర్పాటుకానుంది. మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఇటీవలే కర్నాటక, కేరళలో పర్యటించి అక్కడ వారి మాతృభాష అమలవుతున్న తీరుపై అధ్యయనం చేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. దీనికి అధ్యక్షుడిగా నాటక రచయిత, గాయకుడు, తెలుగు సాహిత్యం, నాటక, కళారంగాలపై పట్టున్న పెద్ది రామారావు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం లోకేష్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఎంలో పనిచేసిన అనుభవమున్న ఆయన, ఒకప్పుడు మహిళలందరికీ చేరువైన దూరదర్శన్ ‘రుతురాగాలు’ సీరియల్‌కు ఊపిరిపోయడం ద్వారా రచయితగా వెలుగులోకొచ్చారు.