రాష్ట్రీయం

అందరికీ ఆరోగ్యరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మార్చి 18: అందరికీ ఆరోగ్యం ప్రభుత్వం తన బాధ్యతగా భావించి, ఆ దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో కస్తూరిబా బాలికల పాఠశాలలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావులతో కలిసి ఆరోగ్యరక్ష కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటయిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ 2.5 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన సేవలందించాలనే ధ్యేయంతోనే ఆరోగ్యరక్ష కార్యక్రమానికి అంకురార్పణ చేశామన్నారు. ఈ పథకం కింద ప్రతివ్యక్తి నెలకు వంద రూపాయల చొప్పున ఏడాదికి 12 వందలు చెల్లిస్తే రెండు లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయని వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అర్హులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వైద్యసేవలు, గ్రామీణ స్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజానీకంలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతోనే వైద్య విద్యార్థులకు గ్రామాలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని, గుంటూరు జిల్లాను మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నందునే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకపై ప్రతి నెలా నాలుగో మంగళవారం దీనిపై సమీక్ష జరుపుతామన్నారు. అసంఘటితరంగ కార్మికుల ఆలంబనకే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈపథకం కింద ప్రమాదం వల్ల మృతిచెందినా శాశ్వత అంగవైకల్యం పొందినా ఐదులక్షల వరకు బీమా చెల్లిస్తారన్నారు. పాక్షికంగా అంకవైకల్యం పొందితే 3లక్షలు, సహజ మరణాలకు 30వేల వంతున చెల్లింపులు జరుగుతాయని వివరించారు. స్పీకర్ కోడెల మాట్లాడుతూ ముప్పాళ్ల మండలంలో నూరుశాతం ఆరోగ్యబీమా అమలు జరుగుతోందని తెలిపారు. నూరుశాతం మరుగుదొడ్లు, దీపం కనెక్షన్లు, ఎల్‌ఇడి బల్బుల పంపిణీ పూర్తయ్యాయని రాష్ట్రంలోనే తొలి మండలంగా రూపుదిద్దుకుందన్నారు.

చిత్రం..ఆరోగ్యరక్ష బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న సిఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితరులు