రాష్ట్రీయం

మాఫీ యూపీకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: పంట రుణాల మాఫీ యుపికి మాత్రమే పరిమితమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నట్టు పిటిఐ సంస్థ తెలిపింది. ఎన్నికల్లో యుపిలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇది కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, జాతీయ విధానం కాదని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ అంశంపై విపక్షాలు నిలదీసిన మీదట మంత్రి స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ యుపిలో రైతుల ఆత్మహత్యల నివారణకు పంట రుణాల మాఫీపై హామీ ఇచ్చారని దానికి బిజెపి కట్టుబడి ఉందని అన్నారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలంటే ఆయా రాష్ట్రాల ఆర్ధిక స్థితిని చూడాల్సి ఉంటుందని, పంట రుణ మాఫీ ఒకే రాష్ట్రానికి పరిమితం చేయడం ద్వారా కేంద్రం వివక్ష చూపుతోందనే ఆరోపణలు సరికాదని ఆయన అన్నారు.