రాష్ట్రీయం

29నే ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: ఉగాది పండుగ ఈనెల 29నే నిర్వహిస్తామని, అందులో ఎలాంటి మార్పూలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి ఈ విషయం స్పష్టం చేశారు. తెలంగాణ విద్వత్సభ ప్రతినిధుల బృందం శనివారం రమణాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇదే వినతిపత్రాన్ని సిఎం కెసిఆర్‌కూ పంపించారు. ఉగాది పండుగకు సంబంధించి ప్రభుత్వపక్షాన స్పష్టమైన ప్రకటన చేయాలని విద్వత్సభ ప్రతినిధులు కోరారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో రమణాచారి తక్షణమే సంప్రదించారు. తర్వాత విద్వత్సభ ప్రతినిధుల బృందంతో మాట్లాడుతూ 29 బుధవారంరోజే ఉగాది
పర్వదినాన్ని జరుపుతామని వివరించారు. ఇలాఉండగా పండగల విషయంలో వచ్చే ఏడాది నుంచి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నేతృత్వంలో విద్వత్సభ ఏర్పాటు చేసి పండితులు, సిద్ధాంతులతో ప్రత్యేక సమ్మేళనంలో చర్చించి తేదీలను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. పండగల విషయంలో ప్రజలు గందరగోళానికి గురికాకుండా చూస్తామన్నారు. ఈ సందర్భంగా విద్వత్సభ పక్షాన రమణాచారిని సన్మానించారు.
రమణాచారిని కలిసిన వారిలో యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, ఆకెళ్ల జయకృష్ణశర్మ సిద్ధాంతి, ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి, గౌరీభట్ల విఠలశర్మ సిద్ధాంతి, ఓరుగంటి మనోహరశర్మ, సిహెచ్ హరినాథశర్మ, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార శాస్ర్తీ, దర్శనం మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వెంకటరమణ శర్మ తదితరులు ఉన్నారు.