రాష్ట్రీయం

ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జనవరి 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక ప్రకటించారు. ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న కరువుభత్యాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుండి నగదు రూపంలో చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం జన్మభూమి సభలో ప్రకటించారు. దీనివల్ల ఏటా ప్రభుత్వంపై రూ.80 నుండి రూ.85 కోట్ల భారం పడుతుందన్నారు. మార్చి నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కరవుభత్యాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించామని, పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచామన్నారు. సమైక్యాంధ్ర పోరాటంలో ఉద్యోగులు 80 రోజుల సమ్మెకాలాన్ని రెగ్యులర్‌చేసి ఉద్యోగులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో భూ రికార్డులు కంప్యూటరీకరణ చేయడంలో రెవిన్యూ యంత్రాంగం కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జేసీ పి.కోటేశ్వరరావు, ఇతర రెవిన్యూ అధికార్లు, ఉద్యోగులను ఆయన అభినందించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందించిన నల్లజర్ల తహసీల్దారును ప్రత్యేకంగా అభినందించారు.