రాష్ట్రీయం

మద్యం భూమిగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 8: రాష్ట్రంలో రెండు లక్షల బెల్టు షాపులను, 4500 ప్రభుత్వ మద్యం దుకాణాలను నడుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమిని మద్యం భూమిగా మారుస్తున్నారంటూ మాజీ పార్లమెంటు సభ్యురాలు, ఐద్వా జాతీయ నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మద్యం వ్యాపారంతో రాజకీయ నాయకులకు సంబంధం ఉందనే అంశం కల్తీ మద్యం ఘటనలో బహిర్గతమైందంటూ అరెస్టు కాబడిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును ఆ పార్టీ బహిష్కరిస్తుందా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే అనేక ప్రాంతాల్లో మద్యం వ్యాపారం సాగిస్తున్నారన్నారు. సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా మద్యం వ్యాపారులకు, నల్లబజారు వ్యాపారస్తులకు అండగా నిలబడే మద్యం విధానాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా మోదీ నుంచి రావలసిన నిధులను సకాలంలో రాబట్టటంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. అయితే ఆ నిధుల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యానికి విచ్చలవిడిగా అనుమతులిస్తూ రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారన్నారు.

వచ్చే నెలకు శ్రీవారి ఆర్జిత
సేవ టిక్కెట్ల విక్రయాలు షురూ
తిరుమల, జనవరి 8 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 1 నుండి 29వ తేదీ వరకు నిర్వహించే వివిధ రకాల ఆర్జిత సేవా టిక్కెట్లు సంబంధించి 54,007 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయని టిటిడి ఈవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం అన్నమయ్య భవన్‌లో జరిగిన డయల్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుగా భక్తులతో మాట్లాడుతూ ఫిబ్రవరి మాసంలో శ్రీవారి ఆలయంలో ఉదయం పూట జరిగే ఆర్జిత సేవలలో సుప్రభాతం 5,717, తోమాల సేవ 80, అర్చన 120, విశేష పూజ 1175, అష్టదళ పాదపద్మారాధన 80, నిజపాద దర్శనం 1478, ఉదయం జరిగే కల్యాణోత్సవం 10,497, మధ్యాహ్నం జరిగే ఊంజల సేవ (డోలోత్సవం) 2800, మధ్యాహ్నం జరిగే బ్రహ్మోత్సవం 6020, వసంతోత్సవం 12040, సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ 13,300 టిక్కెట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. భక్తులు వీటిని ఆన్‌లైన్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఇంటర్నెట్‌లో బుక్ చెయ్యడానికి మరింత సులభతరం చేసామన్నారు. స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు అదే కార్డును విధిగా వెంట తెచ్చుకోవాలన్నారు. 2016 సంవత్సరానికి సంబంధించి 25.05 లక్షల క్యాలెండర్లు, 8 లక్షల డైరీలు ముద్రించి విక్రయించామన్నారు. ముందస్తుగా వీటిని తీసుకురావడంతో భక్తులు విరివిగా కొనుగోలు చేశారన్నారు. వాస్తవానికి ఒక ప్రపంచ రికార్డు అన్నారు. శ్రీవారి సేవకులు తమ స్వహస్తాలతో భక్తులకు లడ్డూలు అందించే అవకాశం ఉన్న లడ్డూ ప్రసాద సేవకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఈ సేవలో పాల్గొనవచ్చునన్నారు. ఆసక్తి కలిగిన వారు టిటిడి పిఆర్‌ఓ ను సంప్రదించాలన్నారు. టిటిడికి వివిధ పథకాలను విరాళం ఇచ్చిన దాతలు తిరుమలకు వచ్చినప్పుడు వసతి, దర్శనం, ప్రసాదాలను సులభంగా అందేలా ఐటి అప్లికేషన్‌ను రూపొందిస్తున్నామన్నారు. జనవరి 16 కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో దాదాపు 300 ఆలయాల్లో, గో శాలల్లో గోపూజ నిర్వహిస్తున్నామన్నారు. సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా పలమనేరు కోసువారిపల్లి వద్ద 10 మెగావాట్లతో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు.