రాష్ట్రీయం

కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 8: దేశంలో పది మంది కార్పొరేట్లు ఏడాదికి లక్ష కోట్లు ఆదాయం గడించే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు నగరంలో సిపిఐ 90వ వార్షికోత్సవ ముగింపు ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భారీ ప్రదర్శన అనంతరం జరిగిన బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షత వహించగా సురవరం ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న 71 లక్షల కోట్ల నల్లధనాన్ని ఏడాదిలోపు స్వదేశానికి తెచ్చి, పేదలకు ఒక్కింటికి 15 లక్షల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్న మాటను మరిచి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ తీరు తెన్నులు తెలియని బిజెపి, అనుబంధ సంఘాలు భారతదేశ దశాదిశా మారుస్తామని చేస్తున్న ప్రకటనలు చూస్తే ఆందోళన కలుగుతోందన్నారు. దేశంలో ప్రస్తుతం అభద్రతాభావం నెలకొని ఉందని, 14 శాతంగా ఉన్న ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైన్‌లు, పరస్పరం సహకరించుకునే సంస్కృతి, సంప్రదాయాలను హిందుత్వం పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. గోవులను రక్షించాలని తొలుత నినాదం చేపట్టి వారికి నచ్చనివారిపై దాడులు చేస్తూ చివరకు హత్యలకు కూడా పాల్పడుతున్నారన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఉండాల్సిన సంప్రదాయాలకు భిన్నంగా ధనం, కులం, మతం, అనేక లొసుగులతో కొనసాగడం ఆందోళన కల్గిస్తుందన్నారు. సిపిఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ పెద్ద టూరిస్ట్‌లాగా మారి కొత్త కొత్త సూట్‌లు వేస్తూ, ఫ్యాషన్ షోలకు వెళ్లినట్లు విదేశీ పర్యటనలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేవిధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. తాజా రాజకీయ పరిణామాలు, బీహర్ ఎన్నికల ఫలితాల విశే్లషణ, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించనున్నటుట సురవరం చెప్పారు.

కాంట్రాక్టు కార్మికుల్ని బలితీసుకున్న
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 8: విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. విద్యుత్ స్తంభాలెక్కి వీరు పనిచేస్తుండగా ఎర్త్‌వైర్ నుంచి వచ్చిన షాక్‌తో దుర్మరణం పాలయ్యారు. స్థానిక మొగల్రాజపురంలో శుక్రవారం మధ్యాహ్నం పట్టపగలు ఈ విషాదం చోటుచేసుకుంది. రామకోటి, శ్రీను అనేవారు కొంతకాలంగా కాంట్రాక్టు బేసిక్‌పై విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నారు. మొగల్రాజపురంలోని ఒక పాఠశాల పక్కనున్న పోల్స్‌కు వైర్ అమర్చే నిమిత్తం ఇద్దరూ చెరో స్తంభం ఎక్కారు. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ సేఫ్టీ తొడుగులు తొడక్కుండా ఎక్కటంతో ఒక్కసారిగా ఎర్త్‌వైర్ నుంచి వారికి షాక్ తగిలింది. దాంతో స్తంభాలపైనే ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడటానికి స్థానికులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను కిందకి దించారు. అయితే ఒక్కసారిగా విద్యుత్ రావటంతో ఇద్దరూ చనిపోయారని ఎఇ రాంబాబు తెలిపారు. స్తంభాలపైకి కార్మికులు ఎక్కినప్పుడు అధికారులు ఆ వైర్లగుండా విద్యుత్‌ను ఎలా సరఫరా చేస్తారంటూ స్థానికులు మండిపడ్డారు.