రాష్ట్రీయం

న్యాయం జరిగేవరకూ విశ్రమించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, జనవరి 8: చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చి, మీకు న్యాయం జరిగేంత వరకూ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతు, చేనేతలకు భరోసానిచ్చారు. రైతు, చేనేత భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం జగన్ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు చింతా గోవర్ధన్, పూజారి బాలాజీ, తుమ్మల వీరారెడ్డి, మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. తొలుత శాంతినగర్‌లో గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు గల కారణాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూజారి బాలాజీ ఇంటికి వెళ్లి అతడి భార్య హారతిని ఓదార్చారు. 8 నెలల క్రితం తన భర్త ఆత్మహత్యకు పాల్పడగా కేవలం అధికారులు వచ్చి వెళ్లారే తప్ప ఇంతవరకూ ఎలాంటి సహాయం అందలేదని మొర పెట్టుకుంది. భర్త చనిపోయిన వెంటనే నెలకు రూ. 600 అందే రేషం సబ్సిడీ సైతం నిలిచిపోయిందని వివరించారు. తుమ్మల వీరారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి భార్య త్రివేణిని ఓదార్చారు. అనంతరం గొట్లూరు గ్రామం వెళ్లి పోతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి భార్య అరుణకు తాము అండగా వుంటామన్నారు.
ధర్మవరంలో గోవర్ధన్ కుటుంబ సభ్యులను
పరామర్శిస్తున్న వైకాపా అధినేత జగన్