ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో తొలి ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 26: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అమలులో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తొలి విజయం సాధించింది. రాష్ట్రంలోనే తొలి బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) జిల్లాగా ఘనత సాధించింది. ఆదివారం జిల్లాలోని పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఇతర జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలో ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరును ప్రకటించారు. అంతక్రితం జిల్లాలో ఓడిఎఫ్ అమలవుతున్న తీరును పరిశీలించే క్రమంలో భాగంగా మంత్రి నారాయణ ప్రత్యేక పాత్రికేయ బృందంతో కలిసి సదరు గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండడం, దాన్ని ఆ కుటుంబ సభ్యులు సక్రమంగా వినియోగించుకోవడం చూసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవాన 2017 మార్చి నెలాఖరులోగా జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా మార్చాలని నిర్ణయించుకొని ‘ఆత్మగౌరవం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని సాధించడం ద్వారా రాష్ట్రంలోనే తొలి జిల్లాగా నెల్లూరును నిలిపినందుకు జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలియజేశారు. మరో రెండు నెలల్లో ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీకి కూడా జిల్లా చేరుకోనుందని, ఈ కేటగిరీలో చేరిన ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో ప్రత్యేక ప్రాధాన్యత అందిస్తుందన్నారు. పురపాలక సంఘాలన్నింటిని ఓడిఎఫ్‌గా ప్రకటించడం ద్వారా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, ప్రస్తుతం అదే క్రమంలో నెల్లూరు జిల్లా తొలి ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించబడడం ఎంతో సంతోషదాయకం అన్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ 936 పంచాయతీల గాను 928 పంచాయతీల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మించడం పూర్తయిందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా 2,34,890 మరుగుదొడ్లను నిర్మించామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడంతో జిల్లాను ఒక్క ఏడాదిలోనే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చగలిగామని స్పష్టం చేశారు. అదేవిధంగా పలు పథకాల అమలులో ప్రస్తుతం నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.

చిత్రం..ఆత్మగౌరవ అభినందన సభలో మాట్లాడుతున్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ