రాష్ట్రీయం

ప.గో.లో కూలిన చర్చి శ్లాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 8: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఒక చర్చి శ్లాబు కూలిన దుర్ఘటనలో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగావుంది. వివరాలిలావున్నాయి... స్థానిక సుంకర పద్దయ్యగారి వీధిలో మన్నా ప్రార్థనాలయం ఆవరణలో కొత్తగా చర్చి నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పనులు మూడు నెలలుగా వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా శ్లాబు నిర్మాణం చేపట్టారు. తాపీమేస్ర్తి మేడిద రమణ ఆధ్వర్యంలో ఉండికి చెందిన కెజెఆర్ ఆర్‌ఎంసి మిక్చర్ సంస్ధ ఈ శ్లాబ్ నిర్మాణం చేపట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో కుప్పకూలిపోయింది. దీనితో పలువురు కూలీలు శ్లాబు కింద చిక్కుకుపోయారు. సుమారు 50 మంది కూలీలు ఆ సమయంలో పనుల్లో నిమగ్నమైవున్నారు. వీరిలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరందరినీ హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి, ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో అంజిరెడ్డి, డి.రవికుమార్, ఎస్.ఆనందకుమార్, ఉదయ్ భాస్కర్, డేవిడ్, వై. శ్రీను, టి. నాని, బి. ప్రభుదాస్, జి.ప్రసాదరావు, ఎన్.రమణయ్య, లక్ష్మీనరసింహరావు, వెలుగుర్తి శ్రీనివాసరావుతదితరులున్నారు. వీరిలో కొందరు ఒడిసా రాష్ట్రానికి చెందినవారు. ప్రమాదం సమాచారం అందుకున్న నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, సబ్-కలెక్టర్ ఎఎస్. దినేష్‌కుమార్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులందరికీ ఉచితంగా వైద్యసహాయం అందిస్తామని ప్రకటించారు. సిమెంట్, కాంక్రీట్ లోడు ఎక్కువ కావడం, హెవీ ఐరన్ ఉండటంతో బరువు ఎక్కువై శ్లాబ్ కూలిపోయిందని భావిస్తున్నారు. అయితే శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకునానరేమో అనే అనుమానంతో గ్యాస్ కట్టర్లతో తొలగించే పని చేపట్టారు. రాత్రి వరకూ పనులు కొనసాగుతున్నాయి.