రాష్ట్రీయం

నేటి నుండి పక్షుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరవారిసత్రం/తడ, జనవరి 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పక్షుల పండుగను నేలపట్టు,పులికాట్ సరస్సు, నెల్లూరు జిల్లా తడ మండలంలోని భీముల వారిపాలెంలో రెండురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. జెడ్పీ సిఇఓ రామిరెడ్డి ఆధ్వర్యంలో నేలపట్టులో పర్యాటకులకు అనువైన వసతులను ఏర్పాటు చేసే క్రమంలో అధికారులు, సిబ్బంది శుక్రవారం తలమునకలయ్యారు. ఏటా నిర్వహించే పండుగే ఐనా ఈ ఏడాది మెగా ఫెస్టివల్‌గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలుతీసుకొంది. నేలపట్టులోని విజ్ఞాన కేంద్రం వద్ద ప్రదర్శనలను తిలకించేందుకు వైద్య శిబిరాలు, ప్రభుత్వ స్టాల్స్, ఆహార స్టాల్స్, తాగునీటి సౌకర్యాలను వేరువేరుగా ఏర్పాటుచేశారు. చెరువు కట్టల వద్ద పక్షులను వీక్షించేందుకు విఐపిలకు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటుచేశారు. మండల కేంద్రం దొరవారిసత్రం నుంచి నేలపట్టు వరకు అసంపూర్తిగా ఉన్న రహదారిని గత రెండురోజుల క్రితం తారురోడ్డు వేశారు. శుక్రవారం నేలపట్టు పక్షుల కేంద్రం పర్యాటకులతో కళకళలాడింది. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచే కాకుండా కడప, అనంతపురం జిల్లానుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి విదేశీ పక్షులను చూసి ఆనందించడం కన్పించింది.

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు

శ్రీకాకుళం, జనవరి 8: శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం మరోసారి స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. పొందూరు మండలం జల్లిపేట, కృష్ణాపురం ప్రాంతాల్లో ఉదయం స్వల్పంగా భూమి కంపించటంతో జనం భయంతో పరుగులు తీశారు. గత రెండు వారాల వ్యవధిలో భూ ప్రకంపనలు రావటం ఇది మూడో సారి. గత నెల రోజుల్లో ఇది ఇదో సారి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని కొవ్వాడ ప్రాంతంలో అణువిద్యుత్ వంటి భారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూ కంపాల సమస్యను యంత్రాంగం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి విష్ణు రాజీనామా?

విజయవాడ, జనవరి 8: ఐదు నిండు ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం కేసులో అరెస్టయి జైలుకెళ్లిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణును ఎందుకు బహిష్కరించడం లేదంటూ టిడిపి నేతలతోపాటు శుక్రవారం నగరానికి విచ్చేసిన మాజీ ఎంపి, ఐద్వా జాతీయ నాయకురాలు బృందాకారత్ కూడా ప్రశ్నించారు. ఈ విధంగా విష్ణు వ్యవహారంపై పలు రకాల ఒత్తిళ్లు వస్తోన్న నేపథ్యంలో పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కల్పించుకుని కేసు విచారణలో ఉన్నందున బహిష్కరించడం సాధ్యపడదు. అయితే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెల్సింది. పిసిసి ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ కూడా ఓ సందర్భంగా నేరారోపణ జరిగితే పదవి నుంచి తప్పించగలమన్నారు. స్వర్ణ బార్ రెస్టారెంట్‌కు నల్గురు లైసెన్స్‌దారులు కూడా విష్ణు కుటుంబ సభ్యులు కావటం గమనార్హం. వీరిలో వృద్ధురాలైన తల్లి త్రిపురసుందరమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.