రాష్ట్రీయం

రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: శ్రీహేమలంబ నామ ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, కేంద్ర మంత్రి బండారు దతాత్రేయ, తమిళనాడు మాజీ గవర్నర్ కె రోశయ్య తదితర ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు అతిథులను సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, ప్రతీ ఏటా గవర్నర్ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం మంచి పరిణామమన్నారు. హేమలంబ నామ సంవత్సరంలో అందరూ బాగుంటాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పచ్చడేనన్నారు. ఉగాది రోజు పచ్చడి రుచి చూశాకే మిగిలిన పనులు ప్రారంభిస్తామని గుర్తు చేశారు.
ఈ ఏడాది అంతా మంచి జరుగుతుందని పంచాంగ శ్రావణంలో చెప్పారని, పాలకులు కూడా కోరుకునేది ప్రజలంతా ఆనందంగా ఉండాలనేనని అన్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో పంచాంగ శ్రావణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

చిత్రాలు..

తెలంగాణ సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఏపి సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ దంపతులకు అభివాదం చేస్తున్న ఏపిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.
*శ్రీ హేమలంబ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పంచాంగ పఠనం చేస్తున్న కె.శ్రీధర్‌శర్మ