రాష్ట్రీయం

కరవురహిత రాష్టమ్రే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహరహం కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో రెండవ పంటకు నీరు ఇచ్చి తీరుతామని, ఇందుకు అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైనంత నీటిని సేకరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని, రైతాంగానికి మేలు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పర్లోవపేటలో శుక్రవారం సాయంత్రం జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎఎంజి పాఠశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం గోదావరి మిగులు జలాలను మాత్రమే తరలిస్తామని, అయితే గోదావరిలో నీరు లేకపోవడం వలనే నేడు రెండో పంటకు ఇబ్బందులు ఏర్పడినట్టు పేర్కొన్నారు. 2004లో తాము అధికారంలో ఉండగా మిగులు విద్యుత్ ఉండగా, 2014కు విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. మళ్ళీ తాము అధికారంలోకి రాగానే ఆ కొరతను అధిగమించి, నేడు మిగులు విద్యుత్‌ను సాధించామన్నారు. దక్షిణ భారతదేశంలో మిగులు విద్యుత్ ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందన్నారు. రాష్ట్రానికి 2 లక్షల 93వేల గృహాలను కేంద్రం మంజూరు చేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో 2.75 లక్షలు, పట్టణాల్లో సుమారు రూ.5 లక్షల యూనిట్ విలువతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో 13వేల కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని, ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ద్వారా కేబుల్ లైన్లను వచ్చే జూలై నుండి వేయనున్నట్టు తెలిపారు. ప్రైవేట్ పార్టనర్ షిప్‌తో కాకినాడ నగరంలోని జగన్నాథపురం ఉప్పుటేరును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఇందుకు సుమారు 90 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలు దళారులకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభకు కాకినాడ సిటీ శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, కాకినాడ ఎంపి తోట నరసింహం, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
పర్యాటక రంగంలో కాకినాడకు ఉజ్వల భవిష్యత్
కాకినాడ తీర ప్రాంతానికి పర్యాటకపరంగా ఉజ్వల భవిష్యత్ ఉందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అన్నారు. టూరిజం హబ్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కాకినాడ వాకలపూడి తీరంలోని ఎన్టీఆర్ బీచ్‌లో శుక్రవారం రాత్రి బీచ్ ఫెస్టివల్-2016ను ముఖ్యమంత్రి రంగు రంగుల బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. అలాగే ఎన్టీఆర్ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. గతేడాది కాకినాడ బీచ్‌కు ఎన్టీఆర్ బీచ్‌గా నామకరణం చేశామని, ఈ ఏడాది నుండి బీచ్ ఫెస్టివల్‌ను రాష్టస్థ్రాయి ఉత్సవంగా జరుపుకుంటున్నామని ఆయనన్నారు. కాగా కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి హాజరైన సభాస్థలికి సమీపంలో పారా గ్లైడర్ ఒకటి అదుపుతప్పి నేల కూలింది. పారాచ్యూట్ తరహాలో గాలిలో ఎగిరే ఈ పారా గ్లైడర్‌ను కిందకు దించుతుండగా ప్రమాదం జరిగింది.

వృద్ధురాలితో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు