రాష్ట్రీయం

ఎంబిసి సంస్థ చైర్మన్ తాడూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30:రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబిసి) కార్పొరేషన్ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కె దామోదర్‌గుప్తా, మెడికల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పర్యాద కృష్ణమూర్తిలను నియమించారు. వీరితోపాటు ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ను కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని సిఎం నిర్ణయించారు. అయితే ఆయనకు ఏ కార్పొరేషన్ ఇవ్వాలన్నది ఖరారు కాకపోవడంతో అధికారికంగా ప్రకటించలేదని సిఎం కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఎంబిసి చైర్మన్‌గా నియమితులైన తాడూరి శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. వెనుకబడిన తరగతులలో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు అదే కులాలకు చెందిన వ్యక్తిని నియామించాల్సి రావడంతో తాడూరి శ్రీనివాస్‌ను చైర్మన్ పదవి వరించింది. నల్లగొండ జిల్లా భువనగిరి ఆయన స్వస్థలం. మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయిన పర్యాద కృష్ణమూర్తి కూడా టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడే. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షునిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన టిడిపిలో పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన దామోదర్ గుప్తా కరీంనగర్ జిల్లా గోదావరిఖని వాస్తవ్యులు. అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటికీ పార్టీ పదవులలో అన్ని సామాజిక వర్గాల వారికీ ప్రాతినిధ్యం ఉండాలన్న నిర్ణయం మేరకు వైశ్య సామాజికవర్గానికి చెందిన గుప్తాను పదవిని కట్టబెట్టారు.

చిత్రం..తాడూరి శ్రీనివాస్