ఆంధ్రప్రదేశ్‌

ఎందుకీ సవతి తల్లి ప్రేమ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పలు సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమ పట్ల సవతితల్లి ప్రేమ కనబరుస్తోందని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అమలుచేసిన వేతన సవరణ, పదవీ విరమణ వయోఃపరిమితి పెంపు తమకు అమలుకావడంలేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలో అన్ని సంస్థలదీ ఒక రూటయితే గృహ నిర్మాణ సంస్థ రూటు సెపరేటు అన్నట్టుగా మారింది. పేదలందరికీ కూడు, గూడు, గుడ్డ అనే నినాదంలో భాగంగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆవిర్భవించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రస్తుతం పెను మార్పులకు గురవుతోంది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా జీతాలు చెల్లించడం తదితర వినూత్న పోకడలు చోటు చేసుకోవడంతో ఉద్యోగులు విస్తుపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీడ లేని నిరుపేదలకు పక్కా గృహ నిర్మాణ పథకం చేపట్టి దేశంలో అగ్రస్థానం పొంది అనేక ప్రశంసలు అందుకున్న ఈ సంస్థ ఇపుడిపుడే మళ్ళీ చేతినిండా పని కల్పించుకుంటోం ది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచడం, వేతన సవరణ (పదవ పిఆర్‌సి ) అమలుపర్చడం తెలిసిందే. పదవీ విరమణ వయోఃపరిమితి పెంపు వ్యవహారం ఎలావున్నా, వేతన సవరణ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ వర్తిస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్‌లో చర్చించిన దరిమిలా దీనిపై ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీఅయ్యింది. రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణ అమలుపరిచినప్పటికీ, గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులకు మాత్రం అమలుపర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ రంగ సంస్థలకు పిఆర్‌సి అమలు చేసి, కేవలం గృహ నిర్మాణ సంస్థలో మాత్రం అమలుచేయకపోవడం దారుణమని ఉద్యోగులు వాపోతున్నారు.
అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లలో కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ వయోఃపరిమితి 60 సంవత్సరాలు అమలుచేస్తున్నారు. 58 ఏళ్లకే రాష్టవ్య్రాప్తంగా పలువురు పదవీ విరమణ చేస్తున్నారు. దీనితో చాలా పోస్టులు ఖాళీ అయిపోతున్నాయి. సంస్థలో ఖాళీగావున్న ఉద్యోగాలు భర్తీచేయకపోవడం వల్ల తీవ్రమైన పనిభారంతో నెట్టుకొస్తున్నారు. పదవీ విరమణవల్ల చాలా ఉద్యోగాలు ఖాళీగానేవున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు తదితర పోస్టులకు పదోన్నతి కన్పించడం లేదు. ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.