రాష్ట్రీయం

దాడులతో పోరాటాలను అణచివేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: అంగన్‌వాడీల పోరాటాలను దాడులతో అణచివేయలేరని సిఐటియు జాతీయ కార్యదర్శి హేమలత అన్నారు. ఐసిడిఎస్‌ను కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆర్టీసి కళాభవన్‌లో రెండో రోజు జరిగిన అఖిల భారత అంగన్‌వాడీ, సహాయకుల మహాసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 5న కార్మిక సంఘాల ఉమ్మడి ఆందోళనతో పాటు 15న ఛలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసిడిఎస్‌ను 2012లో యూపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దానినే ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరించాలనే ఉద్దేశ్యంతోనే వేదాంత కార్పొరేషన్‌కు నాలుగు వేల అంగన్‌వాడీ కేంద్రాలను అప్పగించిందని ఆమె ఆరోపించారు. అంగన్‌వాడీ కేంద్రాలను నందఘర్‌గా మార్చే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ఐసిడిఎస్ నిధుల్లో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వారిపై దాడులు చేయడం, లాఠీ చార్జి జరపడం దారుణమని అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ.ఆర్.సింధు మహాసభ చేసిన తీర్మానాన్ని వెల్లడించారు. ఐసీడిఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై జరిపే పోరాటంలో లబ్దిదారులను కలుపుకుని ముందుకెళ్లాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మహాసభ తీర్మానించిందని సింధు తెలిపారు.
chitram...
శుక్రవారం అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్ల
మహాసభలో మాట్లాడుతున్న సిఐటియు జాతీయ కార్యదర్శి హేమలత