రాష్ట్రీయం

కృష్ణాపై కొత్తమలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేసు వాయిదా
ధర్మాసనంలో మహారాష్ట్ర న్యాయమూర్తి
అభ్యంతరం తెలిపిన తెలంగాణ న్యాయవాది
మరొక ధర్మాసనానికి బదిలీ చేస్తామన్న సుప్రీం
కృష్ణా జలాల పంపిణీపైనా తెమలని పేచీలు
వాటాలపై బోర్డుకు ఇరు రాష్ట్రాల ఫిర్యాదు
25 లేక 28న రాష్ట్రాలతో బోర్డు సమావేశం

హైదరాబాద్, ఏప్రిల్ 19: కృష్ణా ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు బుధవారం కొత్త మలుపు తిరిగింది. కేసును విచారిస్తున్న సుప్రీం ధర్మాసనంలో మహారాష్టవ్రాసి న్యాయమూర్తిగా ఉండటంపట్ల తెలంగాణ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో, కేసును మరోక ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రమే పరిమితంకాదని తెలంగాణ ప్రభుత్వపు తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ట్రిబ్యునల్ ఏర్పాటు కావడంతో దీని పరిధిలోకి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటకలను చేర్చాలని తెలంగాణ న్యాయవాది కోరారు. అలాగే ట్రిబ్యునల్‌పై దాఖలైన కేసును విచారిస్తున్న ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖన్‌వెల్కార్ మహారాష్టవ్రాసి కావడంతో కేసును మరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించి విచారణను వాయిదా వేశారు.
ఇలాఉండగా కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. నదీ యాజమాన్య బోర్డు గతంలో కేటాయించిన నీటిని తెలంగాణ విడుదల చేయలేదని ఆంధ్ర సర్కారు బోర్డుకు ఫిర్యాదు చేయగా, వేసవిలో నెలకొన్న తీవ్ర మంచినీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని 10 టిఎంసి నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలోని నీటిని ఇరు రాష్ట్రాలు ఎంతెంత వాడుకోవాలో స్పష్టంగా చెప్పినప్పటికీ, తమ ఆదేశాలను ఇరు రాష్ట్రాలు పాటించకపోవడంపై ఈనెల 25 లేక 28న హైదరాబాద్‌లో సమావేశం కానున్నట్టు బోర్డు నుంచి ఇరు రాష్ట్రాలకు సమాచారం అందింది. కృష్ణాజలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే నలుగుతున్న వివాదాలకు తోడు ఆదేశాలు బేఖాతర్ చేయడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించింది. కృష్ణా జలాల వినియోగం, కొత్త, పాత ప్రాజెక్టుల వివరాలన్నీ తదుపరి బోర్డు సమావేశంలో సమర్పించాలని ఇరు రాష్ట్రాలకు బోర్టు లేఖలు రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాకు మించి వినియోగించుకుందని ఆంధప్రదేశ్ తాజాగా ఫిర్యాదు చేసింది. తెలంగాణకు కేటాయించిన వాటా కంటే అదనంగా 3.26 టిఎంసి నీటిని వాడుకుందన్నది ఆరోపణ. నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద 2.28 టిఎంసి, ఏఎంఆర్‌పి కింద 0.477 టిఎంసి నీటిని తెలంగాణ వాడుకున్నట్టు ఆంధ్ర చెబుతోంది. శ్రీశైలం జలాశయంలో 775 అడుగుల మట్టానికి పైనున్న 17.64 టిఎంసి నీటిని తనకు కేటాయంచాలని ఆంధ్ర కోరుతోంది. కృష్ణా డెల్టా అవసరాల కోసం 9 టిఎంసి, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు 7.5 టిఎంసి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డును కోరుతోంది. ఇదిలావుంటే, వేసవిలో హైదరాబాద్ నగరంతో సహా కృష్ణాపరీవాహక ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుండటంతో సాగునీటి కంటే మంచినీటికి ప్రాధాన్యత ఇచ్చి తమకు 10 టిఎంసి నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరుతుంది. తమకు కేటాయించిన వాటా మేరకే నీటిని విడుదల చేయకుండా అదనంగా నీటిని విడుదల చేయలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరాకండిగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఈనెల చివరిలో నిర్వహించబోయే సమావేశం కీలకం కానుంది.