రాష్ట్రీయం

సమయం లేదు మిత్రమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 21:‘సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. ఆరు నెలలకు ముందే ఎన్నికలు రావచ్చని నాకున్న సమాచారం. కాబట్టి అందరూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లి పార్టీని గెలిపించడంపై దృష్టి పెట్టండి. మనం ఏం పనిచేసినా పార్టీని గెలిపించడమే ప్రాతిపదికగా ఉండాలి. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించను. కొందరు తమ బాగు కోసమే చూసుకుని కార్యకర్తలను వదిలేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరంతా ముందు పొగడ్తలు మాని పార్టీపనిపై దృష్టి పెట్టం’డని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు క్లాసు తీసుకున్నారు. శుక్రవారం తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతల తీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో మంత్రి ఇన్చార్జిగా ఉంటారని, అక్కడి ఫలితాలు బట్టి మీ గౌరవం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల ఎవరికి ఏ నియోజకవర్గాలు, జిల్లాలు కావాలో చెప్పాలని సూచించారు. ఈ జాబితాను శనివారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయనగరంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు నిర్వహించిన సమావేశాన్ని జిల్లా ఎమ్మెల్యేలు బహిష్కరించడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవలికాలంలో పార్టీ ఓటు బ్యాంకు 16.13 శాతం పెరిగితే, వైసీపీకి 13.45 శాతం తగ్గిందని, కాంగ్రెస్‌కు ఒక్క శాతమే ఉందని విశే్లషించారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ వైపు మొగ్గుచూపిన ముస్లిం వర్గాలు ఇప్పుడు
కొన్ని వార్డుల్లో పార్టీవైపు చూస్తున్నారని, ఈ శాతాన్ని మరింత పెంచాల్సిన బాధ్యత స్థానిక నాయకులే తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఓ నాయకుడు లోకేష్‌ను పొగిడే ప్రయత్నం చేశారు. లోకేష్ మంత్రిగా వచ్చిన తర్వాత అధికారుల్లో చలనం వచ్చి బాగా పనిచేస్తున్నారంటూ బాబును మెప్పించేందుకు చేసిన ప్రయత్నాలను ఆయన వెంటనే అడ్డుకున్నారు. ముందు మీరు పొగడ్తలు ఆపి, పార్టీ పనిచేయండి అని సున్నితంగా మందలించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ బాధ్యతను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారే చూసుకుంటారని, పార్టీ సభ్యత్వాలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయని బాబు స్పష్టం చేశారు. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించాలని, గ్రామకమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

చిత్రం..టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు