రాష్ట్రీయం

టిటిడి ఇఒగా ఎకె సింఘాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన న్యూఢిల్లీలో ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. టిటిడి ఇఓ పదవిని ఉత్తరాదికి చెందిన సింఘాల్‌కు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిపై తెలుగు ఐఏఎస్‌లతోపాటు దక్షిణాదికి చెందిన ఐఏఎస్‌లు కూడా అసంతృప్తితో ఉన్నారంటూ గతనెల 28న ఆంధ్రభూమి దినపత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం టిటిడి ఇవో నియామకం విషయంలో విమర్శలను లెక్కచేయకుండా తాను అనుకున్న అధికారినే నియమించింది. ఫలితంగా టిటిడిలో తొలిసారి ఉత్తరాది అధికారి పాలనకు తెరలేచినట్టయింది. సింఘాల్‌తోపాటు మరో నలుగురు ఐఎఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. టిటిడి ఇవోగా సుదీర్ఘ కాలం సేవలందించిన డి సాంబశివరావు రెవెన్యూ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఎపిభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించే వరకూ ఎపి భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బాబు అహ్మద్ ఎపి స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండిగా నియమితులయ్యారు. ఎపిఐఐసి ఎండి (ఇన్‌చార్జి), రియల్‌టైం గవర్నెన్సు ఇఒ (ఇన్‌చార్జి)గా కూడా వ్యవహరిస్తారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ఎపిఐఐసి ఎండి జె నివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.