రాష్ట్రీయం

వినీల ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేములపల్లి వినీల ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ బ్రోకర్ అయిన భర్త విక్రమ్ విజయసింహ పెట్టిన వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో వినీత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వేములపల్లి సుబ్బారావు, ఉదయలక్ష్మి దంపతుల కూతురు వినీత (32)కు హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ విజయసింహతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.