రాష్ట్రీయం

అట్టపెట్టెలో మృత శిశువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: సర్కారు వైద్యానికి పట్టిన నిర్లక్ష్యపు రోగం వదిలినట్టు లేదు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల సేవలు ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, పరిస్థితులో మార్పు రావటం లేదు. దేశంలోనే అతిపెద్ద రిఫరెల్ ఆసుపత్రిగా పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రి తీరు ఇందుకు భిన్నంగా లేదు. తొమ్మిది నెలలపాటు ఇక్కడే నెలసరి వైద్య పరీక్షలు చేయించుకున్న ఓ గర్భిణికి, ప్రసవం తర్వాత బిడ్డ చనిపోయిందంటూ మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి ఇవ్వటం సంచలనమైంది. వరంగల్‌కు చెందిన గర్భిణి గత తొమ్మిది నెలలుగా నిలోఫర్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంది. కొద్దిరోజుల క్రితం వరకూ వైద్యులు శిశువు పరిస్థితి బాగానే ఉందని, కొంతబరువు తక్కువ ఉందని చెప్పుకుంటూ వచ్చారు. ప్రసవ సమయం రావడంతో గర్భిణిని సోమవారం ఆసుపత్రిలో చేర్చారు. అపుడూ వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో బిడ్డ క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పురుడు పోసి, శిశువు చనిపోయిందంటూ మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి ఇచ్చారని బంధువులు భోరుమంటున్నారు. ఇదేంటని బంధువర్గం ప్రశ్నిస్తే, మొదటినుంచీ శిశువు తక్కువ బరువుతో బలహీనంగా ఉందని, తల్లి కడుపులోనే చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయం మొదట్లో వైద్యులు చెప్పలేదని, కడుపులో బిడ్డ చనిపోయి ఉండివుంటే తల్లి ప్రాణానికీ ముప్పు ఏర్పడి ఉండేదని బంధువర్గం గగ్గోలు పెడుతోంది. దీనికితోడు శిశువు మృతదేహాన్ని నిర్లక్ష్యంగా అట్ట పెట్టేలో పెట్టి తమకివ్వడం మరింత బాధాకరంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వర్గాల చర్యను బాధిత వర్గం ఆగ్రహంతో నిలదీసింది. అదే సమయంలో ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి కొత్త బ్లాకు సందర్శించేందుకు వస్తుండటంతో, అక్కడకు వచ్చిన కొందరు మీడియా ప్రతినిధుల కంట ఘోరం పడింది. బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటుండగా, ఆసుపత్రి సెక్యూరిటీ అడ్డుకోవడం గమనార్హం.

చిత్రం..నిలోఫర్ సిబ్బంది అట్టపెట్టలో పెట్టి ఇచ్చిన మృతశిశువు