రాష్ట్రీయం

ఒంటరి మహిళకు పెన్షన్ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఒంటరి మహిళకు నెలకు వెయ్యి రూపాయల ఫించను ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మే 8నుంచి వారంపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 2న ఫించన్ చెల్లిస్తారు. ఏప్రిల్, మే నెలల ఫించన్ జూన్ 2న ఒకేసారి చెల్లిస్తారు. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఒంటరి మహిళలు పథకం వల్ల ప్రయోజనం పొందుతారు. ఏడాదికన్నా ఎక్కువ కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటున్న 18 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు ఫించను లభిస్తుంది. పెళ్లికాని మహిళలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు ఉంటే ఫించనుకు అర్హత. పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారు పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. ఈనెల 8నుంచి దరఖాస్తు చేసుకోవాలి. వారంపాటు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. అర్హుల జాబితా ఈనెల 25 నాటికి రూపొందిస్తారు. అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు. గతంలో ఇంట్లో ఎవరికైనా ఆసరా ఫించను పొందే వారుంటే బీడీ కార్మికుల ఫించను లభించేది కాదనీ, ఈ నిబంధన సవరించి అలాంటి వారుఉన్నా బీడీ కార్మికులకు ఫించను ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆసరా ఫించన్ పొందేవారు ఉన్నా ఈపిఎఫ్ ఉంటే బీడి కార్మికుల ఫించన్ లభిస్తుంది.
దాదాపు మరో 80వేల మంది బీడీ కార్మికులకు ఫించను లభించేలా ప్రభుత్వం ఉత్తర్వులు సవరించినట్టు చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 40లక్షల మందికి ఆసరా ఫించన్లు లభిస్తాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఒంటరి మహిళలకు ఫించన్ల పథకం ప్రకటించినట్టు మంత్రి చెప్పారు.