రాష్ట్రీయం

ఎమ్సెట్‌కు 2.20 లక్షల మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణ ఎమ్సెట్‌కు 2,20,070 మంది దరఖాస్తు చేశారు. 12న ఎమ్సెట్ నిర్వహించేందుకు ఎమ్సెట్ కమిటీ సర్వం సన్నద్ధం అయింది. 9వ తేదీలోగా అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య పేర్కొన్నారు. ఇంత వరకూ 70వేల మంది తమ హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన చెప్పారు. 12వ తేదీ ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకూ అగ్రికల్చర్ స్ట్రీం పరీక్ష జరుగుతుందని తెలిపారు.
ఆ రోజు పూర్తిగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని సిపిడిసిఎల్‌ను కోరామని, అలాగే బస్సులను అందుబాటులో తిప్పాలని ఆర్టీసీని సూచించామని వివరించారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే అనుమతిస్తారని కనుక అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని చెప్పారు. పెన్ను, ఆన్‌లైన్ అప్లికేషన్, హాల్‌టిక్కెట్లను తెచ్చుకోవాలని, మిగిలిన వేటినీ అనుమతించేది లేదని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇంజనీరింగ్‌కు 246, అగ్రికల్చర్‌కు 154 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,20,070 దరఖాస్తులు రాగా అందులో ఇంజనీరింగ్‌కు 1,41,054 అగ్రికల్చర్‌కు 79,013 దరఖాస్తులు వచ్చాయి. రాష్టవ్య్రాప్తంగా 24 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆంధ్రాలో మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విజయవాడ కేంద్రానికి 14,085, విశాఖపట్టణం కేంద్రానికి 6363, తిరుపతి కేంద్రానికి 5766 దరఖాస్తులు వచ్చాయి.