రాష్ట్రీయం

ఏపి భవనాలకోసం తెలంగాణ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్‌లోని ఉమ్మడి రాష్ట్రంలో పదవ షెడ్యూల్‌లో ఉన్న భవనాలను స్వాధీనం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎక్కడి ఆస్తులు అక్కడే అన్న సూత్రంపై కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం హైదరాబాద్‌లో పదవ షెడ్యూల్ పరిధిలో దాదాపు 100కు పైగా సంస్ధల భవనాలు ఉన్నాయి.
వీటి విలువ దాదాపు 70 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్ర విభజన తర్వాత ఈ కార్యాలయాల్లో ఉన్న ఆంధ్ర సిబ్బందిని విజయవాడకు, గుంటూరుకు తరలించారు. కేంద్ర హోంశాఖ వద్ద ఈ విషయం పెండింగ్‌లో ఉండడం వల్ల ఆంధ్ర ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న భవనాల్లోని గదులకు తాళం వేసింది. పైగా ఈ భవనాల పర్యవేక్షణ లోపించింది. ఈ నేపథ్యంలో వీటిని స్వాధీనం చేసుకుని పర్యవేక్షించాలని, తమ ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఎక్కడి ఆస్తులు అక్కడే అనే ఆదేశం ప్రకారం భవనాలు, వాటికి చెందిన ఖాళీ స్ధలాలు, వౌలిక సదుపాయాలు అన్నీ తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయి. హైదరాబాద్‌లో స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపి పోలీసు అకాడమి, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజిమెంట్ రీసెర్చి సంస్ధ, శ్రీరామానంద తీర్ధ ట్రైనింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఎక్సైజ్ అకాడమి, ఏపి స్టడీ సర్కిల్, ఈ విధంగా 142 సంస్ధలు ఉన్నాయి.
కాగా ఆంధ్రాలో ఏపి స్టడీ సర్కిల్ ఫర్ బీసీస్, పద్మావతి వర్శిటీ, ద్రవిడ వర్శిటీ తదితర సంస్ధలు ఉన్నాయి. వీటి విలువ రూ. 3650 కోట్లని అంచనా. ఈ ఆస్తులన్నీ ఆంధ్ర ప్రభుత్వానికే దక్కుతాయి.
కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణగా హైదరాబాద్‌లో పదవ షెడ్యూల్ ఆస్తులను అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ భవనాలను అప్పగించే విషయమై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 2వ తేదీకి తెలంగాణ అవతరించి మూడేళ్లు గడుస్తుంది. ఇక ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కేంద్ర హోంశాఖ ఆదేశాలను అమలు చేసేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేస్తున్నట్లు సమాచారం. బ్యాంకుల్లో 5వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ సొమ్మును జనాభా నిష్పత్తి ప్రకారం 58:42 కింద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదు.
కాగా ఇక్కడ ఏపి సచివాలయం భవనాల పర్యవేక్షణ అధ్వానంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటూ భవనాల ఫోటోలు, వీడియో తీసి కేంద్ర హోంశాఖకు పంపించింది.