రాష్ట్రీయం

ఖమ్మంలో అఖిలపక్షం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 2: గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేసిన రైతులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగర దిగ్బంధం కార్యక్రమం జరిగింది. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని, మిర్చి క్వింటాకు 15వేలు రూపాయలను చెల్లించాలని ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోకి ప్రవేశించే 8ప్రధాన రహదారుల వద్ద తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంగళవారం ఉదయం పది గంటల నుండి 11గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శులు బాగం హేమంతరావు, వెంకటేశ్వరరావు, పోటు రంగారావులు మాట్లాడుతూ గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర వస్తే అంతా బంగారమేనని చెప్పిన అధికార పార్టీ నేతలు రైతులు ఆందోళన చేస్తే తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు.
పత్తి పంట వేయవద్దని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేసిన నేతలు ప్రభుత్వం వేయమన్న అపరాలకు గిట్టుబాటు ధర లేని విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రశ్నించిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. కాగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144సెక్షన్ ఉన్న నేపధ్యంలో ఆందోళన కారులను ఎక్కడిక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్రం..ఖమ్మంలో ఆందోళన చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే సండ్ర , తదితరులు