ఆంధ్రప్రదేశ్‌

చివరి బస్తావరకూ కొనుగోలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 5:చివరి బస్తా వరకూ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతుకు అభయమిచ్చారు. మిర్చి కొనుగోళ్లపై అమెరికా నుంచి ఆయన శుక్రవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రైతులు ఆందోళన చెందవద్దు.. చివరి రైతు వరకూ ప్రయోజనం చేకూరుస్తాం.. చివరి బస్తా వరకు కొనుగో లు అయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది’ అని హామీ ఇచ్చారు. కర్నూలు, ఒంగోలు, చిలకలూరిపేటలో కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తెచ్చి దూరాభారం తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు హమాలీలకు అదనపు భత్యం ఇవ్వాల్సిందిగా సూచించారు. కొనుగోళ్లకు గడువును పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8వేలు వచ్చేలా తగు చర్యలు తీసుకుంట్నునట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.రైతులు తెచ్చే సరుకుకు నిల్వ సామర్థం లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని సమీక్షలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ మేరకు రైతులకు తగు సూచనలు చేసి కొనుగోలు కేంద్రాలకు కంగారుపడి ఒకేసారి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.