రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలపై నలుగుతున్న ఎంట్రీ ఫీజు విధానం రద్దుపై బుధవారం రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం విజయవాడలో జరుగుతుంది. ఈ సమావేశంలో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంట్రీ ఫీజు విధానం రాష్ట్ర విభజన తర్వాత అమలులోకి వచ్చింది. దీని వల్ల రెండు రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు సాలీనా రూ.60 వేలవరకు ఎంట్రీ ఫీజును చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ చెప్పారు. ఎంట్రీ ఫీజు వల్ల నష్టపోతున్నామన్నారు. సింగిల్ పర్మిట్ విధానం అమలులోకి వస్తే సాలీనా ఐదు వేల రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య 14 సరిహద్దుచెక్‌పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న అలంపూర్ చెక్ పోస్టు, విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చెక్ పోస్టు వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ ఫీజు రద్దుపై చర్చించిన తర్వాత సింగిల్ పర్మిట్ విధానాన్ని ఖరారు చేసేందుకు విధి విధానాలపై అధికారులు అనేక ప్రతిపాదనలు చేశారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలియచేస్తామని, అంగీకారం కుదిరితే జూన్ 2వ తేదీ నుంచి ఎంట్రీ ఫీజు రద్దయ్యే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.