రాష్ట్రీయం

రవాణా బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: పెద్దనోట్ల రద్దు తర్వాత తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి వినియోగదారులపై రవాణాశాఖ యూజర్ చార్జీలను భారీగా పెంచింది. వివిధ సేవల కింద వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న అన్ని యూజర్ చార్జీలను దాదాపు రెట్టింపు చేసింది. పెంచిన యూజర్ చార్జీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రవాణా శాఖలో రాబడికి ప్రధాన వనరులుగా ఉన్న ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వ్యక్తిగత వాహనాలు, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్ సర్ట్ఫికేట్ (ఆర్‌సి) చార్జీలను ఒక్కసారిగా పెంచేసింది. నాన్ ట్రాన్స్‌పోర్టు ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ సర్ట్ఫికేట్ చార్జీని రూ.100 నుంచి 200కు పెంచింది. ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ ఫీజును రూ.100 నుంచి 150కి పెంచింది. నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ సర్ట్ఫికేట్ ఫీజును రూ.200 నుంచి 400కు పెంచింది. డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ యూజర్ చార్జీని రూ.30 నుంచి రూ.100కు, లైట్ మోటర్ వెహికిల్ లైసెన్స్ చార్జీని రూ.100 నుంచి రూ.300కు, లైట్ మోటర్ వెహికిల్ ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ చార్జీని రూ.50 నుంచి రూ.200కు పెంచింది. హెవీ వెహికిల్ నాన్ ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ చార్జీని రూ.100 నుంచి రూ.300కు పెంచింది. ఆటో రిక్షా ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్ చార్జీలను రూ.30 నుంచి రూ.100కు పెంచింది. ఇతర వాహనాల ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్ చార్జీలను కూడా రూ.60 నుంచి రూ.200కు పెంచింది.కాగా రెండవ వాహనంపై ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తున్న 2 శాతం పన్ను చెల్లించాలన్న నిబంధనను ఎత్తివేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం కొత్త వాహనం కొనుగోలుపై లైఫ్ టాక్స్‌గా 12 శాతం వసూలు చేస్తుండగా, రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా రెండు శాతం (14 శాతం) వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్న దృష్ట్యా రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా చార్జీలు వసూలు చేయడం సబబు కాదంటూ రవాణాశాఖ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు అధికార వర్గాల సమచారం.