ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో బిజెపినే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 10: రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బిజెపినేనని, వ్యాపారుల పక్షం ఉంటూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అధికార టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. బస్తర్ ఎంపి దినేశ్‌కశ్యప్‌తో కలిసి బుధవారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహరిస్తున్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. ఖమ్మం మార్కెట్‌లో దళారులు ఈనామ్‌ను ధ్వంసం చేస్తే రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం మిర్చికి మద్దతుధర ప్రకటించిందని, కానీ పదిరోజులు గడిచినా కొనుగోళ్ళు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జరపలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడిచిన మూడేళ్ళలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక అభివృద్థి సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రపంచంలో అగ్రగామి దేశంగా రూపుదిద్దుకున్నదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనేక పొరపాట్లు చేస్తున్నదని, దానిని కప్పిపుచ్చుకునేందుకు మాటల గారడిని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే మత రిజర్వేషన్లు తీసుకొని వచ్చారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో రహదారులు అభివృద్థి జరుగుతుంటే తామే చేశామని చెప్పుకోవడం రాష్ట్ర నేతలకే చెల్లిందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలవడంలో బిజెపి సఫలీకృతమైందని, వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి తమ సత్తా నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అనేక సర్వేలు అన్ని రాష్ట్రాల్లోనూ మోదీకే సానుకూలత ఉందని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు.