రాష్ట్రీయం

నిర్లక్ష్యానికి ఇదీ మూల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: అతి విశ్వాసం, నిర్లక్ష్యం, వేగమే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, చిన్ననాటి మిత్రుడు రవివర్మను పొట్టన పెట్టుకున్నాయి. ప్రమాద సమయంలోనూ ప్రాణాలకు ఎలాంటి ముప్పూ కలిగించని ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నా, ఇద్దరూ ప్రాణాలు వదిలేశారంటే వేగం తీవ్రతను అంచనా వేయొచ్చని రోడ్డు సేఫ్టీ నిపుణులు అంటున్నారు. ప్రమాదానికి గురైన కారు అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన రెండున్నర కోట్ల రూపాయల మెర్సిడెస్ బెంజ్. యూరో ప్రమాణాలకు అనుగుణంగా తయారైన జర్మనీ కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొని తుక్కుతుక్కు అయిపోయిందంటే, ప్రమాదం తీవ్రతను అంచనా వేయొచ్చు. నిషిత్‌కు ముందునుంచే కారు వేగంగా నడిపే అలవాటుంది. గతంలో వేగంగా కారు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. ఒక్క ఏడాదిలోనే అతివేగం కారణంగా నిషిత్‌కు నాలుగుమార్లు జరిమానాలు విధించినట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత జనవరి 24న గండిపేట వద్ద నిషిత్ 150 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కాడు. అలాగే గత మార్చి 1న మరోసారి గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో, మార్చి 10న మాదాపూర్ ఔటర్ రింగ్‌రోడ్డులో అతివేగంతో కారు నడిపినట్టు ట్రాఫిక్ పోలీసుల సమాచారం. కారును అతివేగంగా నడిపిన నేరం కింద టిఎస్ 07 ఎఫ్‌కే 7117పై రూ.4,305 జరిమానాలు ట్రాఫిక్ పోలీసులు విధించారు. తాజా ప్రమాదాన్ని బట్టి మితిమీరిన వేగంతో కారు నడపటం నిషిత్‌కు అలవాటుగా తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గురైనప్పుడు నిషిత్ 200 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సర్వీలెన్స్‌లకు సైతం అందనంత వేగంగా కారు నడుపుతున్నట్టు గుర్తించామని ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పీడోమీటర్ స్తంభించటంతో, అది 200 కెఎంపిహెచ్ వేగాన్ని సూచిస్తుండటం గమనార్హం.

చిత్రం..200 కిలోమీటర్ల వేగాన్ని సూచిస్తూ స్తంభించిన స్పీడోమీటర్