రాష్ట్రీయం

నెల్లూరుకు చేరిన నిషిత్ మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, మే 10: నిషిత్ నారాయణ పార్థివదేహాన్ని బుధవారం రాత్రి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలోని ఆయన నివాసానికి అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన వెంటనే ఇంటి వద్ద ఉన్న బంధువులు, వివిధ కళాశాల సిబ్బంది ఆర్తనాదాలు మిన్నంటాయి. నారాయణ కుటుంబాన్ని బుధవారం రాత్రి ఐటి శాఖ నారా లోకేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతోపాటు మంత్రులు పరిటాల సునీత, కామినేని శ్రీనివాసులు, కళా వెంకట్రావు, చిన్నరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, ఎంపి కేశినేని నాని, రాజ్యసభ్యుడు సిఎం రమేష్, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జెసి ఇంతియాజ్ అహ్మద్, నారాయణ కుటుంబాన్ని కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు.
నిషిత్ మృతి బాధాకరం: లోకేష్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఏ కుటుంబానికి ఇంతటి కష్టం రాకూడదని, మంత్రి నారాయణలాంటి మంచి వ్యక్తికి ఇంతటి అన్యాయం జరగడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోందన్నారు. ఆ కుటుంబాన్ని మనోధైర్యంతో మరలా తమ జీవితాలను ముందుకు సాగేవిధంగా దేవున్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శత్రువుకైనా ఇలాంటి కడుపుకోత రాకూడదని ఆయన అన్నారు. మంత్రి నారాయణ లండన్ నుండి బయలుదేరారన్నారు. వేకువజామున నాలుగు గంటల లోపు నెల్లూరు చేరుకోవచ్చని పలువురు తెలిపారు.
నేడు అంత్యక్రియలు
నిషిత్ నారాయణ అంత్యక్రియలు నేడు బోడిగాడితోటలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నారాయణ కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం ప్రజల దర్శనార్థం పార్థివదేహాన్ని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలో ఉంచుతారని, అక్కడ నుండి ఊరేగింపుగా బోడిగాడితోటకు తీసుకెళతారని నారాయణ బంధువులు తెలిపారు.

చిత్రం..నిషిత్ పార్ధివ దేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు