రాష్ట్రీయం

అమరావతి నిర్మాణంలో చైనాతో దోస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చైనా భాగస్వామ్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన చైనా మంత్రులతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా కొత్త ఒప్పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సింగపూర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం మలేషియాను, జపాన్‌ను సైతం అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేయాలని చూస్తోం ది. అదే రీతిలో చైనాతోనూ కలిసి పనిచేయాలని చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన అనంతరం తొలిసారిగా సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో నూతన రాజధాని అమరావతికి సంబంధించి చైనాకు చెందిన గుజాయ్ మారిటైమ్ స్కిల్ రోడ్డు ఇంటర్నేషనల్ ఇనె్వస్టుమెంట్ కార్పొరేషన్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అవగాహన ఒప్పం దం కుదుర్చుకోనుంది.
ఇందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను సిఆర్‌డిఎ కార్యదర్శి అజయ్ జైన్ కోరారు. 11వ తేదీన విశాఖలో జరిగే కార్యక్రమంలో సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్, జిఐఐసి సిఇఓ జాంగ్ జాయ్ సంతకాలు చేయనున్నారు. నూతన రాజధాని నిర్మాణంలో చైనా కంపెనీల పెట్టుబడులను రాబట్టేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని జిఐఐసి కోరినట్టు తెలిసింది. అమరావతిలో చైనా పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఆ కంపెనీ ఉంది.
సిఆర్‌డిఎ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా సమకూర్చే పనిలో తాము సహకరిస్తామని చైనా కంపెనీ చెప్పినట్టు తెలిసింది. బృహత్తర ప్రణాళిక అభివృద్ధి, వౌలిక వసతుల కల్పన ప్రణాళిక, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. కీలకమైన ఒప్పందంలో అంశాలు గోప్యంగా ఉంచడంతో వెలుగు చూడలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భాగస్వామ్య సదస్సులో 25 అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్టు తెలిసింది. బంగ్లాదేశ్, అఫ్గాన్, మలేషియా, చైనా, సింగపూర్, అమెరికాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు భారత్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధానంగా ఉపాధి కల్పన, వౌలిక వసతులు, వైద్య సదుపాయాల పెంపు, రవాణా, ఐటి రంగంలోనూ, ఐటిఇఎస్ రంగంలో కూడా పలు ఒప్పందాలు కుదరనున్నాయి.

ఐసిడిఎస్‌కు నిధులు పెంచాలి

అంగన్‌వాడీ కేంద్రాలను కుదించొద్దు
అఖిల భారత మహాసభ డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఐసిడిఎస్‌కు నిధులు పెంచి మరింత విస్తృతంగా అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఐసిడిఎస్‌ను కుదించే యోచన విరమించుకోవాలని అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2016-17 బడ్జెట్‌లో నిధులు పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న యూనియన్ 8వ అఖిల భారత మహాసభల్లో పాల్గొన్న సింధు సమావేశ వివరాలను శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలో 360 జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో పని చేస్తున్న మహిళలు గౌరవప్రదంగా జీవిస్తున్నారని అన్నారు. ఐసిడిఎస్‌కు మరింత బడ్జెట్ పెంచి ఆ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపవద్దని అన్నారు. ‘ఐసిడిఎస్‌ను పరిరక్షించాలి’ అనే నినాదంతో పోరాటంలో ముందుకు సాగుతూ ఒత్తిడి తెస్తామని ఆమె వెల్లడించారు. నిధుల్లో కోత విధించకుండా ఐసిడిఎస్‌ను పటిష్టం చేస్తే శిశు మరణాలు తగ్గుతాయని, పౌష్టికాహార లోపం వల్లే దేశంలో ఏటా 80 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో మాతా శిశు మరణాలు తగ్గించి పౌష్టికాహారం అందించడంలో కృషి చేయాలని ఆమె కోరారు.
ఐసిడిఎస్‌ను కుదించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు విరమించుకోవాలని రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భారతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం తీసుకు వచ్చిన జీవో నెం.14ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.