రాష్ట్రీయం

భూ సేకరణ బిల్లుకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ బిల్లు-2016కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కేంద్రం ఆమోదించిన బిల్లు చట్టం రూపంలో శుక్రవారం గెజిట్ విడుదల అవుతోంది.
నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర భూ సేకరణ చట్టంలో పేర్కొన్న పరిహారానికంటే మెరుగైన పరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి కేంద్ర ఆమోదానికి పంపించగా కొన్ని క్లాజులను తొలగించాల్సిందిగా బిల్లును తిప్పి పంపించిన విషయం తెలిసిందే. కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం శాససనభను ప్రత్యేకంగా సమావేశపరచి బిల్లులో సవరణలు చేసి, కేంద్రానికి పంపింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా రూపొందించిన బిల్లుకు కేంద్రం ఇదివరకే ఆమోదం తెలపడంతో అదే తరహాలో తెలంగాణ బిల్లుకూ కేంద్ర మంత్రివర్గం రెండు రోజుల కిందట ఆమోదించి రాష్టప్రతి ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్టప్రతి కూడా ఆమోదించడంతో ఒకటి రెండు రోజులలో గెజిట్ విడుదల కాబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.