రాష్ట్రీయం

కదులుతున్న నరుూం తుట్టె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు పోలీస్ అధికారులపై వేటు పడింది. రాజకీయ నాయకులపై విచారణ కూడా జరిగింది. అయితే తాజాగా సిఐడి, సిట్ జరుపుతున్న దర్యాప్తులో నరుూంతో లింకున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు 16 మంది అధికారులకు చార్జిమెమోలు జారీ చేశారు. పోలీస్ శాఖ సూచనల మేరకు ఈ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 20 మందికిపైగా పోలీసు అధికారులపై విచారణ జరిపేందుకు రంగం సిద్ధమైంది. నరుూం కేసులో అవినీతితో సంబంధం ఉన్న అనుచరులపై, నరుూం ఆగడాలు, బెదిరింపులు, భూ కబ్జా, హత్యలపై సిట్ దర్యాప్తుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసు అధికారులు చంద్రశేఖర్, సాయి మనోహర్, ప్రకాశ్ రావు, వెంకటనర్సయ్య, అమరేందర్ రెడ్డి, తిరుపతన్న, వెంకట్‌రెడ్డి, నరేందర్ గౌడ్, కిషన్, రవికిరణ్ రెడ్డి, వెంకటయ్య, బల్వంతయ్య, రవీందర్, సూర్యప్రకాశ్, శ్రీనివాస్ నాయుడు, శ్రీనివాసరావు, మాజిద్, పోలీసు కానిస్టేబుళ్లు బాలయ్య, మహ్మద్ మియాలపై అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో తమపై చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇన్‌ఫార్మర్ వ్యవస్థ దెబ్బతింటుందని వేటుకు గురైన పోలీస్ అధికారులు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పైగా పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నప్పటికీ, డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులనే టార్గెట్ చేసి వేటు వేయడంపై చర్చనీయాంశంగా మారింది. నరుూంతో లింకులున్న రాజకీయ నాయకులను వదిలేసి ముందుగా పోలీస్ అధికారులపై వేటుకు దిగిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుండగా తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, ఎమ్మెల్సీ విద్యాసాగర్‌లపై కూడా వేటు పడనున్నట్టు సమాచారం. వీరిని అరెస్టు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులకు నరుూంతో లింకులున్నట్టు తేలితే జైలు శిక్ష తప్పదని కూడా పోలీస్ అధికారులు చెబుతున్నారు.