రాష్ట్రీయం

మున్సిపాల్టీల్లో సిఎస్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులనుఆదేశించారు. సిఎండిఎలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో కెటిఆర్ సోమవారం సమావేశమయ్యారు. ప్రతి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాల్లో ఎల్‌ఈడీ లైట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి, పౌరులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, ఆదాయ రాబడి, పట్టణాల, మున్సిపాలిటీల పనితీరు మెరుగు పరిచేందుకు ఎనిమిది మందితో కమిటీని వేసినట్టు మంత్రి చెప్పారు. కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇస్తుంది. డిసెంబర్ నాటికి అన్ని పట్టణాలను ఓడియప్ (బహిరంగ మల మూత్ర విసర్జన రహితం)గా ప్రకటించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ అంశంలో కొన్ని పట్టణాలు వెనకబడ్డాయని అంటూ, ఆయా పట్టణాల్లోని అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ఉండాలన్న లక్ష్యం జూన్ 15నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా మున్సిపాలిటీలో ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే నేరుగా సిడియంఏ నుంచి ఒక అధికారిని ప్రత్యేకంగా ఆయా పట్టణాలకు పంపాలని ఆదేశించారు. మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మారిన మున్సిపాలిటీల అధికారులను మంత్రి అభినందించారు. ప్రతి పట్టణంలో డంప్ యార్డులను అభివృద్ధి చేయాలని కెటిఆర్ కమిషనర్లకు సూచించారు.
ప్రతి కమిషనర్‌కు తమ పట్టణం పట్ల పూర్తి అవగాహన ఉండాలని, పట్టణ వనరులు, అవసరాలు, ప్రణాళికలపై పట్టు ఉన్నప్పుడే మార్పు సాధించగలుగుతామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఒక్కరు చురుగ్గా పని చేస్తే పట్టణం మొత్తం రూపురేఖలు మారుతాయన్నారు.
వర్షాకాలంలో హరితహారంలో భాగంగా మెడిసినల్, సువాసనలు వెదజల్లే మొక్కలను డంప్ యార్డుల్లో నాటాలని సూచించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రణాళిక రూపొందించి కావలసిన అవసరాలను సిడియంఏ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికీ తప్పనిసరిగా రేడియం జాకెట్లు, బూట్లు, గ్లౌస్‌ల వంటి రక్షణ పరికరాలు విధిగా ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కమిషనర్లు హైదరాబాద్ నగరంలోని ఆదర్శ స్మశాన వాటికలు, ఇతర ప్రదేశాలను సందర్శించారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని పట్టణాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు.