రాష్ట్రీయం

జూన్ 10న రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో పంటలకు వర్షపునీటిని అందించే నైరుతీరుతుపవనాలు ఒకటి రెండు రోజులు ఇటుఅటుగా జూన్ 10 న ఎపిలోని అనంతపురం, తెలంగాణలోని జోగులాంబ, మహబూబ్‌నగర్ జిల్లాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (హైదరాబాద్ కేంద్రం) అంచనావేస్తోంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రవేశించిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇవి రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా కొనసాగుతోంది. నైరుతీరుతుపవనాలు ప్రస్తుతం బంగాళాఖాతంలోని నైరుతీ, ఆగ్నేయ ప్రాంతాలవైపు కదులుతున్నాయి. అలాగే అండమాన్ సముద్రంలోని మిగతా ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయని ఐఎండి ప్రకటించింది.
ఇలా ఉండగా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా హోళగుండలో ఐదుసెంటీమీటర్లు, పత్తిపాడు, ఆలూరులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కడప, కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒకటి, రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు.