ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు మరణాలు.... తాగి నడిపితే పదేళ్ళు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: మద్యం మత్తులో వాహనాలు నడిపి ఎదుటి వారి మృతికి కారణమైతే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని డిజిపి నండూరి సాంబశివరావు హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రతి నాలుగో మంగళవారం సిఎం అన్ని సంబంధిత శాఖలతో సమీక్షిస్తున్నారని, ఈమేరకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా తాగి వాహనం నడిపి ప్రమాదాలు చేసేవారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వచ్చేవారం నుంచి ఎక్సైజ్ శాఖతో కలిసి మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక బీట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోడ్డు భద్రతపై డిజిపి సమీక్ష నిర్వహించారు. ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకుని వాటి తక్షణ అమలుకు ఆదేశాలిచ్చారు. అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చంపాలనే ఉద్దేశంతో వాహనంతో ఢీకొట్టి నేరం చేస్తే దాన్ని హత్యగా పరిగణిస్తారని, అనుకోకుండా జరిగితే వాటిని రోడ్డు ప్రమాదాలుగా భావించి ఇప్పటివరకు సెక్షన్ 304ఏ ఐపిసి కింద కేసులు నమోదు చేస్తూ వచ్చామన్నారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా ప్రమాదం జరుగుతుందని, తద్వారా ఎదుటివారు చనిపోతారని తెలిసీ తాగి డ్రైవింగ్ చేయడం అత్యంత తీవ్రమైన నేరంగా భావించాలనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఇక నుంచి అలాంటి వారిపై తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుపడినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా.. ఇదే స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలోని ప్రతి మద్యం దుకాణం వద్ద వచ్చే వారం నుంచి బీట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామన్నారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా ప్రతిరోజూ ‘ఫైన్ డే’ అమలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. తణుకులో పోలీసులపై ఎమ్మెల్యే దాడిని ప్రస్తావిస్తూ ఘటనపై కేసు నమోదైందని, తప్పుచేస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇక విజయవాడ వైద్యుల దందా కేసులో పోలీసులపై చర్యను ప్రస్తావించగా సామాన్యులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే తప్పు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.