రాష్ట్రీయం

బాబుది రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణరెడ్డి హత్యలో బాబు, కేఈల ప్రమేయం
బాబును జైల్లో పెడితే కానీ రాష్ట్రం బాగుపడదు గవర్నర్ నరసింహన్‌కు జగన్ వినతి

హైదరాబాద్, మే 22: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడండి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడదని అన్నారు. సోమవారం వైఎస్ జగన్ తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ నారాయణరెడ్డి హత్యకు సిఎం చంద్రబాబు సూత్రధారి, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పాత్రధారి అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో నారాయణరెడ్డి గెలుపొందుతారని భావించే రాజకీయ హత్య చేయించారని ఆయన విమర్శించారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాక్షసకాండ కొనసాగిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. అధికారపక్షం తొలుత తమ పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఆ ప్రలోభాలకు లొంగనివారిని ఇలా ప్రాణాలు తీస్తున్నదని ఆయన తెలిపారు. నారాయణరెడ్డి హత్యతో మరోసారి ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కేసుల్లో దోషులుగా, నిందితులుగా ఉన్న సొంత పార్టీ వారిని కేసుల నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 132జివో విడుదల చేసిందని ఆయన ఉదహరించారు.
నారాయణ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని, గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవడాన్ని ఈ నేపథ్యంలో గమనించాలన్నారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుని నేతృత్వంలో సాగుతున్న ఇసుక మాఫీయాపై విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించేంత వరకూ నారాయణ రెడ్డి పోరాటం చేశారని జగన్ గుర్తు చేశారు. నారాయణ రెడ్డి హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సంసపూర్ణ సహకారం అందించారని ఆయన విమర్శించారు. అందుకే పోలీసులు ఉదయం 9.30గంటలకు హత్య జరిగితే, మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఘటనా స్థలానికి వెళ్ళలేదన్నారు. ఆలస్యంగా వెళ్ళడం ద్వారా సాక్ష్యాధారాలు చెదిరిపోవాలన్నది పోలీసుల ఉద్ధేశ్యమై ఉండవచ్చని అన్నారు. టిడిపి అధికారం చేపట్టిన తర్వాత హత్యలకు గురైన తమ పార్టీ నాయకుల జాబితాను గవర్నర్‌కు అందజేశామని ఆయన చెప్పారు. రాజమండ్రిలో 29మందిని, స్మగ్లర్లని మరో 29మందిని చంపేశారన్నారు. వీటన్నింటికీ చంద్రబాబు బాధ్యుడని కేసులు పెట్టి జైలుకు పంపించాలన్నారు. చంద్రబాబును ఎవరు విమర్శించినా కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. సోషల్ మీడియానూ వదలడం లేదన్నారు. సోషల్ యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని చంద్రబాబును జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో మండల స్థాయి టిడిపి నాయకులకు గన్‌మెన్లను ఇస్తున్నారని, తమ పార్టీ చెందిన వారికి ఇవ్వడం లేదన్నారు. నారాయణ రెడ్డికి సరైన భద్రతను ప్రభుత్వం కల్పించలేదని జగన్ విమర్శించారు.

చిత్రం... గవర్నర్ నరసింహన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైపాకా అధినేత జగన్