రాష్ట్రీయం

ఎడతెగని తగాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: అప్పులు తీరలేదు. చర్చల్లో పరిష్కారం లభించలేదు. రెండు రాష్ట్రాలు ఢిల్లీ జోక్యం చేసుకుని అప్పుల సమస్యను తీరుస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం హాట్ హాట్‌గా నడుస్తోంది. 11వ తేదీ నుంచి విద్యుత్‌ను తెలంగాణకు నిలుపుదల చేస్తామని ఆంధ్ర ప్రకటిస్తే, తమ నుంచి ఆంధ్రాకు వెళ్లే విద్యుత్‌ను బంద్‌చేస్తామని తెలంగాణ ప్రకటించింది. ఈ నిర్ణయం అమలుపై రెండు రాష్ట్రాల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విభజన జరిగి మూడేళ్లు గడచినా 9,10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తులు, అప్పులు, భవనాల పంపకం ఒక కొలిక్కిరాలేదు. కేంద్రం నిర్ణయం తమకు ఆశాజనకంగా ఉందని తెలంగాణ అంటుంటే, మాకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై కేంద్రాన్ని మరోసారి సంప్రదించి, న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టు గుమ్మం తలుపుతడతామని ప్రకటించింది. కృష్ణా జలాల వివాదం ఎక్కడ వేసిన గొంగళి అనే తంతులా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అప్పు పంచగా మిగిలిన 20వేల కోట్ల పంపకంపై రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోలేకపోయాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత కేంద్రానికి అప్పచెప్పాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ విషయమై ఈ నెలాఖరులో కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల ఆర్ధిక శాఖాధికారులను ఢిల్లీకి ఆహ్వానించి సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించనుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన 2014 జూన్ 2వ తేదీన జరిగింది. అప్పటికి ఉమ్మడి రుణ భారం రూ. 1.68 లక్షల కోట్లు ఉంది. ఈ రుణాలను జనాభా నిష్పత్తి ప్రకారం పంచేందుకు కేంద్రం కంప్ట్రోలర్ అడిట్ జనరల్ కార్యాలయానికి అప్పగించింది. ఈ సంస్ధ అధికారులు మొత్తం అప్పులో 1.48 లక్షల కోట్ల అప్పును జనాభా నిష్పత్తి ప్రకారం పంచారు. ఆంధ్రాకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం అప్పును పంచగా, రెండు రాష్ట్రాలు సమ్మతించాయి. కాగా పేచీ అంతా మిగిలిన 20 వేల కోట్ల చుట్టూ మూడేళ్లుగా తిరుగుతోంది. ఈ రుణాన్ని పంపకంపై రెండు రాష్ట్రాల అధికారులు అనేక సార్లు సమావేశమైనా, ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ అప్పులో ఎక్కువ భాగాన్ని ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ ప్రాంతంలో ఖర్చుపెట్టారని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ అప్పు్భరాన్ని మొత్తం తెలంగాణ రాష్టమ్రే భరించాలని ఏపి కేంద్రాన్ని కోరింది. కాగా మిగిలిన అప్పులో 42 శాతాన్ని తెలంగాణ భరించేందుకు సిద్ధంగా ఉందని, జనాభా నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ కోరింది. మొత్తం అప్పులో 42 శాతం మాత్రమే భరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతేకాని 42 శాతం దాటితే అంగీకరించేదిలేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 20 వేల కోట్ల అప్పుపంపకంలోప్రతిష్టంభన ఏర్పడిందని, ఈ నిధులను హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుకు, హుస్సేన్ సాగర్ క్లీనప్ ప్రాజెక్టు తదితరమైన వాటికి ఖర్చుపెట్టారు. ఇందులో కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ వౌలిక సదుపాయాలకు కూడా ఖర్చుపెట్టిన సొమ్ము చేరి ఉంది. 20 వేల కోట్ల రుణంలో ఎనిమిది వేల కోట్లు కేంద్రం ఇచ్చిన రుణాలు ఉన్నాయి. వివిధ ప్రాజెక్టులకు పదివేల కోట్లను ఖర్చుపెట్టారు. ఈ నిధులను కూడా ప్రాంతాల వారీగా విభజించి రెండు రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య సమస్య తలెత్తితే కేంద్ర హోంశాఖ పరిష్కరించాలి. నాంపల్లిలో ఉమ్మడి రాష్ట్రంలో ట్రెజరీ కార్యాలయాన్నినిర్మించారు. ఈ కార్యాలయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బీమా సొమ్ముపై వచ్చిన వడ్డీతో నిర్మించారు. ఈ భవనంలో తమకు వాటా కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కాగా భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉండే భవనం ఆ ప్రాంతానికి చెందుతుందని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.