రాష్ట్రీయం

నిర్లక్ష్యాన్ని సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్, సబ్ ఆర్టేరియల్ రోడ్ల నిర్మాణంలో జాప్యాన్ని ఇక ఏ మాత్రం సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పనులు నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు అల్టిమేటం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చెప్పిన సమయంలోగా పనులు పూర్తిచేయని నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజధానిలో నిర్మిస్తున్న రహదారులు, పరిపాలన, విద్యా నగరాల పురోగతిని శనివారం తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. భూసేకరణలో ఉండవల్లి, పెనుమాక, తదితర మూడు గ్రామాల నుంచి ఎదురైన అవరోధాలను ఒక్కొక్కటీ అధిగమిస్తున్నామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మూడు గ్రామాల్లో భూ సమీకరణకు ముందుకు వస్తున్న వారి నుంచి ముందు భూమిని సమీకరించి, ఆ తరువాత భూసేకరణకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకవేళ ఇంకా ఎవరైనా తమ భూముల్లో సాగు చేసుకుంటామంటే వారిని అలానే వదిలిపెడతామని, రానున్న కాలంలో ఆ భూములను వ్యవసాయతేర అవసరాలకు వినియోగించకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని గ్రీన్‌బెల్ట్ కింద ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. స్వార్థ బుద్ధితో రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. అత్యాశకు పోతే దక్కవలసింది కూడా దక్కకుండా పోతుందని వ్యాఖ్యానించారు. పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ దాదాపు పూర్తయిందని, వచ్చే వారంలో దీన్ని ప్రభుత్వానికి అందజేస్తామని నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థ తెలిపినట్టు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలియజేశారు. శాసనసభ భవనం నిర్మాణ ప్రణాళికపై శుక్రవారం జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో సవివర ఆకృతులను సమర్పించారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌ను హైడెన్సిటీ డెవలప్‌మెంట్‌లోనే ఉంచాలని సూచించామని చెప్పారు. శాసనసభ భవంతికి, నదీ తీరానికి మధ్యలో గల సెంట్రల్ యాక్సిస్‌లో వ్యూయింగ్ టవర్ ఉండేలా తుది ఆకృతులు సిద్ధం అవుతున్నాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మిళితం చేస్తూ నిర్మించబోయే కల్చరల్ సెంటర్‌ను కూడా తుది ప్రణాళికలో ఉంచాలని ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థకు సూచించామన్నారు. హైకోర్టు కానె్సప్టును రీడిజైన్ చేస్తూ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్తగా మరో కానె్సప్టును ప్రదర్శించారని, అందులో అవసరమైన మార్పులు సూచించగా, తుది ఆకృతుల్లో పొందుపరుస్తున్నారని చెప్పారు.
సమావేశంలో విట్, అమృత, ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌ఐటి తదితర విద్యా సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయా సంస్థల ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. విట్-ఏపీ యూనివర్సిటీ క్యాంపస్ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ఏడాది జూలైలో నూతన అడ్మిషన్లు తీసుకుంటున్నామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. గుంటూరులో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నామని, అమరావతిలో తొలిదశ నిర్మాణం పూర్తవ్వగానే, ఇక్కడకు మార్చుతామని చెప్పారు. అత్యుత్తమ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైఫై బస్సులు, హాస్టళ్లతో జూలై 19వ తేదీ ఉదయం 9 గంటలకు తమ విద్యా సంస్థను లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు. ‘స్టార్ స్టూడెంట్’ ప్రోగ్రాం కింద టాపర్స్‌గా నిలిచిన ఒక బాలిక, ఒక బాలుడిని ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసి వారికి ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చెన్నయ్‌లో తాత్కాలికంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తోంది. అమృత యూనివర్సిటీ 2018లో అడ్మిషన్లు ప్రారంభిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, బిజినెస్ విభాగాలతో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో తమ సంస్థ అమరావతి క్యాంపస్‌ను మేటి విద్యా సంస్థగా నిర్వహించనున్నదని ఆ సంస్థ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలో ఏర్పాటవుతున్న ఈ యూనివర్సిటీలన్నింటిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, దీనిపై నిరంతర చర్చ జరపడం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలకు జాతీయస్థాయి బ్రాండింగ్ వస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలన్న తన ఆలోచనకు తగినట్టుగా పేరొందిన విశ్వవిద్యాలయాలు అమరావతిలో అడుగుపెట్టడం తమకు సంతృప్తినిస్తోందని అన్నారు. అమరావతిలో ఏర్పాటవుతున్న విశ్వవిద్యాలయాలకు కాంపౌండు వాల్స్ ఉండవని, నగరంలో భాగంగా ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలతో నేరుగా అనుసంధానం చేయడానికే కాంపౌండ్ వాల్ లేకుండా యూనివర్సిటీలను ఉంచాలన్న నిర్ణయానికి వచ్చామని అన్నారు. విద్యాసంస్థలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రం.. ఇలా అన్నీ ఓపెన్‌గానే ఉంటాయన్నారు.
సంతోష నగరంగా అమరావతి: మెకన్సీ ప్రెజెంటేషన్
అమరావతిని సంతోష నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ సంస్థ మెకన్సీ ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ అందించింది. ముఖ్యంగా అత్యున్నత విద్యా వసతుల ద్వారానే అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ పెంచగలుగుతామని పేర్కొంది. ఎకనామిక్ డెవలప్‌మెంట్, సోషల్ వెల్ బీయింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, గవర్నెన్స్ అండ్ సస్టెయినబులిటీ మొదలైన ఐదు అంశాలతో అమరావతిని సంతోష నగరంగా మార్చవచ్చునని సూచించింది. 2050 నాటికి అమరావతి 1.5 మిలియన్ ఉద్యోగాలను అందించే నగరంగా, రూ.120,000 కోట్ల మెట్రో సరి సమాన జీడిపి అందించే నగరంగా రూపొందగలదన్నారు. తొమ్మిది నగరాలను అనుసంధానం చేస్తూ మెకన్సీ సంస్థ రూపొందించిన హ్యాపీ సర్కిల్ గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరంగా తెలుసుకున్నారు. నవీన నగరంలో వినోదానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడల కోసం అనేక ఆప్షన్లు ఉండాలన్నారు. అమరావతిని ఒలింపిక్స్ బంగారు పతకాల ఖార్ఖానాగా రూపొందించాలన్న మెకన్సీ ప్రతిపాదనపై వివరంగా చర్చించాలన్నారు. అమరావతిలో ఏర్పాటయ్యే ప్రతి భవంతికి సొంతంగా విద్యుత్ సమకూర్చుకునే వ్యవస్థ, నీటిని పునర్ వినియోగానికి ఉపయోగించుకునే ఏర్పాటు ఉండాలన్నారు. ఒకనాడు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాలంటే మూడేళ్ల వ్యవధి పట్టేదని, ఇప్పుడు నాలుగు మాసాల్లో చిన్నతరహా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని అన్నారు. నగరంలో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే తిరిగేలా అమరావతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్ రూపొందించాలని సిఆర్‌డిఏను ఆదేశించారు.
‘ఇండియన్ డిస్నీ వరల్డ్’గా శాఖమూరు పార్క్
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూపొందించిన శాఖమూరు పార్క్‌పై ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి సిఎండి లక్ష్మీపార్థసారధి ప్రజెంటేషన్ ఇచ్చారు. 250 ఎకరాల్లో ఏర్పాటుచేసే ఈ పార్కు నగరానికి ప్రధాన ఆకర్షణ కాగలదన్నారు. ఇందులో సాహస క్రీడలు, జల క్రీడలు, అంతర్జాతీయ స్థాయి ఉద్యానవనాలు, మ్యూజిక్ ఫౌంటేన్, వాటర్ ఫాల్స్, బటర్ ఫ్లై పార్క్, రిసార్టులు, హోటళ్లు, షాపింగ్ కేంద్రాలు, ధియేటర్లు.. ఇలా అన్నీ ఉంటాయన్నారు. దీన్ని ఇండియన్ ‘డిస్నీ వరల్డ్’గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

చిత్రం.. సిఆర్‌డిఏ పనితీరును సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు