రాష్ట్రీయం

తెలుగు మీడియంకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పరికిస్తే, రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం ఎత్తివేసినట్లుగానే కనిపిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు మీడియం పుస్తకాల కోసం అసలు ఇండెంటే పెట్టకపోవడంతో ఇక మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం నిలిపివేసినట్టుగానే భావించవచ్చు. విద్యార్థుల తల్లితండ్రుల నుంచి వస్తున్న డిమాండ్, ప్రపంచ వ్యాప్త పోటీలో తెలుగుమీడియం విద్యార్థులు వెనుకబడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మార్చిలో మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం రద్దు చేస్తూ పురపాలక శాఖ అకస్మిక నిర్ణయాన్ని వెలువరించడం తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలు, తెలుగు భాషాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వార్షిక పరీక్షలు కొద్ది రొజుల్లో ప్రారంభం కానున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై తల్లితండ్రులు, విద్యార్థులు అప్పట్లో అయోమయానికి గురైయ్యారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీషు మీడియం రెండూ కొనసాగుతాయని, విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంచుకోవచ్చని అధికార వర్గాలు అప్పట్లో తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 2800 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరచిన తొలిరోజే పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందచేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పురపాలక సంఘాలకు పాఠ్యపుస్తకాలు చేరాయి. కానీ ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలన్నీ ఇంగ్లీషు మీడియానికి సంబంధించినవి. తెలుగు మీడియం పుస్తకలు మున్సిపల్ పాఠశాలలకు సరఫరా కాలేదు. అసలు అధికారులే తెలుగు మీడియం పాఠ్యపుస్తకాల గురించి ఇండెంట్ కూడా పెట్టలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ విధంగా ఇండెంట్ పెట్టామని, తెలుగు మీడియం పుస్తకాల గురించి ఇండెంట్ పెట్టలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్ పాఠశాలలకు తెలుగుమీడియం పాఠ్య పుస్తకాల సరఫరా నిలిపివేయడం ద్వారా పరోక్షంగా కొత్త విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియాన్ని తప్పని సరి చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి కేవలం ఇంగ్లీషు మీడియానికే మున్సిపల్ పాఠశాలలను పరిమితం చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం ఈ విషయమై పురపాలక శాఖ అధికారులను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. తెలుగు భాషాభివృద్ధికి కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల సిఎంకు సమర్పించిన నివేదికలో ప్రాథమిక విద్య స్థాయిలో తెలుగుమీడియం తప్పని సరి చేయాలని పేర్కొంది. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం పాఠ్యాంశాలను అర్థం చేసుకునే విధంగా తగిన ప్రత్యేక శిక్షణ వంటివి లేకుండా ఆదరాబాదరగా ప్రారంభించడం విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై తెలుగుభాషాభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.