ఆంధ్రప్రదేశ్‌

జిఎస్టీ రద్దు చేసేవరకూ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: జిఎస్టీని రద్దు చేసేంతవరకూ రాష్టవ్య్రాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులమంతా ఐక్యంగా పోరాడతామని ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి చెప్పారు. కేంద్రం విధించిన జిఎస్టీని రద్దుచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం విజయవాడ కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ ఆవరణలో ఆదివారం జరిగింది. సమావేశానికి రాష్టవ్య్రాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులంతా తరలివచ్చారు. సమావేశంలో మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా వస్త్ర వ్యాపారులు, రెడీమేడ్ వ్యాపారులు, టైలరింగ్ వంటి వివిధ అనుబంధ విభాగాల్లో సుమారు కోటి మంది వస్త్ర రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన జిఎస్టీ పన్ను విధానం వల్ల కోటి మంది జీవనం దెబ్బతినే పరిస్థితులు ఉత్పన్నవౌతున్నాయన్నారు. గతంలో వ్యాట్ విధించిన సందర్భంలో వస్త్ర వ్యాపారులంతా కలసికట్టుగా ఉద్యమించి దాన్ని రద్దు చేయించుకున్నామన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఎంట్రీటాక్స్ వేసినా, కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ వ్యాట్ విధించినా పోరాటాలతో వాటిని ఎదుర్కొన్నామని చెప్పారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా గతంలో వ్యాట్‌పై జరిగిన ఉద్యమానికి మద్దతు పలికి తమ ప్రభ్వుంలో ఎలాంటి పన్నులు ఉండవని తమకు హామీ ఇచ్చారన్నారు. అదే హామీకి కట్టుబడి ఎన్‌డిఏలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వస్త్రాలపై జిఎస్టీని రద్దుచేసేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం తాము ఏ పోరాటాలకైనా సిద్ధమని వ్యాపారులు ప్రతిజ్ఞ చేశారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో వస్త్రాల ఉత్పత్తి జరగటం లేదని, ముంబై, సూరత్ ప్రాంతాల్లోని మిల్లుల్లో ఉత్పత్తి జరిగేచోటే జిఎస్టీ విధించాలన్నారు. కంకటాల షోరూమ్ అధినేత మల్లిక్ (వైజాగ్) మాట్లాడుతూ ఉత్పత్తి స్థానంలో దారానికి రంగు పడినప్పుడే 18 శాతం పన్ను విధిస్తున్నారని, తరువాత చీరకు ఎంబ్రాయిడరీ వంటి ఎలాంటి అదనపు డిజైన్ తగిలించినా మరో 18శాతం, డైయింగ్‌కు మరో ఐదు శాతం, మేఘ హోల్‌సేలర్ నుంచి హోల్‌సేలర్లకు, అక్కడి నుంచి రిటైలర్, అక్కడి నుంచి వినియోగదారుడికి ఇలా చేతులు మారిన ప్రతి సందర్భంలోనూ ఐదు శాతం పన్ను పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక వస్తువును కొనుగోలు చేసి దాన్ని అమ్మేలోపు ఒక దుకాణంలో ఆరుసార్లు కంప్యూటర్‌లో నమోదు చేయాల్సిన నిబంధనలు తాజాగా జిఎస్టీలో కనిపిస్తున్నాయని బొమ్మన సంస్థల అధినేత బొమ్మన రాజకుమార్ (రాజమండ్రి) అన్నారు. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదముందన్నారు. ఇది వారిపై ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు కలిగించే అంశమన్నారు. నోట్ల రద్దు, ఇతర వ్యవసాయ పరిస్థితుల నేపథ్యంలో వస్త్ర వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితుల్లో జిఎస్టీ వంటి నిర్ణయాలు వ్యాపారంపై గుదిబండగా మారే ప్రమాదముందని సిఎంఆర్ గ్రూప్ అధినేత వి వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్రాలపై జిఎస్టీ విధించిన తీరుపై దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు ఆందోళన బాట పట్టారని కళానికేతన్ అధినేత వి చంటి అన్నారు. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద వస్త్ర వ్యాపార కేంద్రమైన సూరత్, తదితర ప్రాంతాల్లో సమ్మెకు కూడా వెళ్తున్నారని వివరించారు. జిఎస్టీ రద్దుచేయని పక్షంలో గతంలో ఎక్సైజ్ డ్యూటీ విధించిన విధంగా వస్త్రాలను ఉత్పత్తి చేసే మిల్లులోనే అందరికీ ఆమోదయోగ్యమైన పన్నులు వేయాలని ఏపి టెక్స్‌టైల్ ఫెడరేషన్ కోశాధికారి వెలంపల్లి రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నేతలు ఉప్పు ప్రకాష్ (విజయనగరం), శ్రీనివాస్ (తెనాలి), బచ్చు వెంకటప్రసాద్ (విజయవాడ), పొట్టి ఆంజనేయులు (నరసరావుపేట), గోపీనాథ్ (తిరుపతి), వాగిచర్ల బాలప్రసాద్, ఓలేటి భవానీశంకర్, బొగ్గవరపు నరసింహారావు, పేర్ల భీమారావు, 13 జిల్లాల వస్త్ర వ్యాపార సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు కూడా ప్రసంగించారు.

చిత్రం.. వస్త్ర వ్యాపారుల సమావేశంలో మాట్లాడుతున్న బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి