రాష్ట్రీయం

మహాకవి మహాప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలుగు సాహితీ, సినీ లోకం మూగవోయింది. ఓ మహాస్రష్టను కోల్పోయింది. దశాబ్దాల పాటు తెలుగు సాహితీ, సినీ రంగాలను తనదైన విశిష్టతతో ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విశ్వంభరుడు పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి(86) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో గత వారం రోజులుగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినారె తుదిశ్వాస విడిచారు. కోలుకుంటున్నారని భావించినంతలోనే పరిస్థితి విషమించి ఆయన దూరమయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. కేర్ ఆస్పత్రి నుండి ఉదయమే ఆయన మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నారాయణ రెడ్డి నివాసం వద్దకు మంత్రులు, నాయకులు, విద్యావేత్తలు చేరుకుని నివాళులు అర్పించారు.
నారాయణ రెడ్డి భార్య సుశీల కాగా, ఆయనకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు. సి నారాయణ రెడ్డి అంతిమసంస్కారం అధికార లాంఛనాలతో బుధవారం ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. డెట్రాయిట్‌లో ఉన్న ఆయన మనవడు ఇప్పటికే బయలుదేరారని, ఆయన రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి అంతిమ సంస్కారాన్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించేలా పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం మున్సిపల్ మంత్రి కెటిఆర్‌కు అప్పగించారు.
కెటిఆర్‌తో పాటు తాను కూడా ఆ బాధ్యతల్లో పాలుపంచుకుంటానని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు.

చిత్రం.. 1931- 2017 *డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి