రాష్ట్రీయం

అంగుళం కూడా పోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: రాజధానిలోని మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాలలో జాగీరు భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కుంభకోణం జరగనేలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరుగలేదని, ఆ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని, సిబిఐ విచారణ అవసరం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జాగీర్ భూములపై హక్కులు సంపాదించడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించినప్పటికీ ఒక్క అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాలేదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ ఆధీనంలోని భూములను రిజిస్ట్రేషన్లు చేయకూడదన్న నిబంధనను విస్మరించిన అధికారులు కొందరిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకున్నామని, విచారణ ఇంకా కొనసాగుతుందని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లోని భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ కావడం వెనుక కుంభకోణం జరిగినట్టు ప్రతిపక్షాలు, మీడియాలో వస్తున్న కథనాలను ముఖ్యమంత్రి ఖండించారు. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ప్రగతిభవన్‌లో మంగళవారం రెవిన్యూశాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, డిజిపి అనురాగశర్మ తదితరులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పాత జాగీర్ భూములపై హక్కులు సాధించడానికి కొందరు వ్యక్తులు జిపిఎలు సృష్టించి, తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు ప్రభుత్వం భావిస్తుందన్నారు.
వాస్తవానికి ప్రభుత్వ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడానికే అవకాశం లేదని, ఒకవేళ చేసినా చట్టబద్ధత ఉండదని, చెల్లదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మియాపూర్‌లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేట్ వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్స్ చేశారని ముఖ్యమంత్రి వివరించారు. ఈ మొత్తం భూమి విలువకు రిజిస్ట్రేషన్ చార్జీగా రూ.415 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అయితే నామమాత్రంగా రూ.60 లక్షలు మాత్రమే చెల్లించారన్నారు. ఎంతో కొంత కట్టాలని కట్టారు తప్ప దీనివల్ల భూ బదలాయింపు జరగదన్నారు. ఈ రిజిస్ట్రేషన్లకు చట్టబద్ధత ఉండదని, ఎక్కడా చెల్లుబాటు కాదన్నారు. జాగీర్ భూములపై హక్కుల కోసం వారు చేసిన ప్రయత్నాలకు సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కడా నెగ్గకపోవడంతో సుప్రీంకోర్టులో కేసులు వేశారన్నారు. సుప్రీంకోర్టుకు కూడా ప్రభుత్వం తరపున పూర్తి వివరాలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాలానగర్, మియాపూర్‌తో పాటు మరో ఏడు గ్రామాలలో జరిగిన వ్యవహారం కూడా ఇలాగే ఉందని ముఖ్యమంత్రి వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నేరుగా వివరాలు పంపించి కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకునే విధంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.